Gurukula school: ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని అదృశ్యం.. సీసీ కెమెరాలో అవాక్కయ్యే దృశ్యాలు..!

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీని చేధించారు. అయితే, బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరా విజువల్స్‌ పరిశీలించిన పోలీసులు..ఆ సీన్‌ చూసి అవాక్కయ్యారు..

Gurukula school: ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని అదృశ్యం.. సీసీ కెమెరాలో అవాక్కయ్యే దృశ్యాలు..!
Student Missing

Updated on: Aug 21, 2022 | 10:25 AM

Gurukula school: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6వ తరగతి అదృశ్యం కలకలం రేపింది. లకావత్ శివాని అనే విద్యార్థిని కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీని చేధించారు. అయితే, బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరా విజువల్స్‌ పరిశీలించిన పోలీసులు..ఆ సీన్‌ చూసి అవాక్కయ్యారు..ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

గీసుకొండ మండలం కొమ్మలకు చెందిన శివాని స్వగ్రామం అని స్కూల్ యాజమాన్యం తెలిపారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నిరయ్యరు. గురుకుల పాఠశాల సిబ్బంది గేట్లు తీయక పోవడంతో, గేటు వద్దే తల్లి దండ్రులు బోరున విలపిస్తూ.. ఆందోళనకు దిగారు. పోలీసులు సిసి టివిలు పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు..కొన్ని గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.

సిసి టివి ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ గుర్తించారు పోలీసులు. శివాని తన స్నేహితురాలి తండ్రితో కలిసి పుట్టలభూపతి గ్రామానికి వెళ్లినట్లు గుర్తించారు. ఆ గ్రామానికి వెళ్లి స్నేహితురాలి ఇంట్లో ఉన్న శివానిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక సురక్షితంగా తమ ఇంటికి చేరటంతో ఆ తల్లిదండ్రులు, స్కూల్‌ సిబ్బంది, పోలీసులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. కానీ, బాలిక ఆచూకీ తెలియనంత సేపు ఆ తల్లిదండ్రులు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. వారి రోదనలు విన్న గ్రామస్తులు, స్థానికులు సైతం చలించిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us