Gandhi Bhavan Fight: ఇలాంటివి చూడటానికా ఢిల్లీ నుంచి వచ్చింది.. గాంధీ భవన్ గొడవపై దిగ్విజయ్‌ సీరియస్‌..

లీడర్‌కి పదవి రాకున్నా లొల్లే.. కేడర్‌కి పోస్ట్ రాకున్నా లొల్లే.. కాంగ్రెస్‌తో అట్లుంటది మరి. గల్లీలో అందరం ఒక్కటేనంటారు.. గాంధీభవన్‌కి వెళ్లగానే బస్తీ మే సవాల్ అంటారు. అదేంటని ప్రశ్నిస్తే.. అంతర్గత ప్రజాస్వామ్యం అని కలరింగ్ ఇస్తారు. ఇది చూసిన దిగ్విజయ్‌ సింగ్‌‌ ఏమన్నారంటే..

Gandhi Bhavan Fight: ఇలాంటివి చూడటానికా ఢిల్లీ నుంచి వచ్చింది.. గాంధీ భవన్ గొడవపై దిగ్విజయ్‌ సీరియస్‌..
Digvijaya Singh On Gandhi Bhavan Fight

Updated on: Dec 22, 2022 | 7:29 PM

గొడవలు పక్కనపెట్టి రండి సర్దుకుని కలిసికట్టుగా పోరాడదాం అని అధిష్టానం దూతగా దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చి మరీ గాంధీభవన్‌లో చర్చలు జరుపుతుంటే… బయట కేడర్‌ అబ్బే మా గొడవ మాదే అంటూ బాహాబాహికి దిగారు. కాలర్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు… ఈ గొడవపై దిగ్విజయ్‌ సీరియస్‌ అయ్యారు. చర్చలు జరుపుతుండగానే ఇలాంటి గొడవలేంటని నేతలపై మండిపడ్డారు. ఇలాంటివి చూడటానికా తాను ఢిల్లీ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మనం ఏమన్నా అధికారంలో ఉన్నామా అంటూ నేతల్ని నిలదీశారు.

ఇదిలావుంటే.. మరోవైపు గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ చర్చలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం  వరకు నేతలతో వరుసగా భేటీ అయ్యారు. సీనియర్లు భట్టి, జానారెడ్డిలతోపాటు సీతక్క, గీతారెడ్డి, రేణుకా చౌదరి వంటి నేతల నుంచి సమాచారం సేకరించారు. ఎవరికి వారు తమ అభిప్రాయాలను దిగ్విజయ్‌కు వివరించారు.

గాంధీ ముందు రచ్చ రచ్చ..

సేవ్‌ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ అన్యాయం జరిగిందని గాంధీభవన్‌కి వచ్చిన ఓయూ విద్యార్థి సంఘం నేతలను ఉద్దేశించి ఎక్కడ అన్యాయం జరిగిందని నిలదీశారు మాజీ ఎమ్మెల్యే అనిల్‌. దీంతో రెండు వర్గాల మధ్య పెరిగిన మాటామాట పెరిగింది. గల్లాలుపట్టు మరీ ఒకరినొకరు నెట్టేసుకున్నారు. మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పబోయిన మల్లు రవిని కూడా తోసేశారు.

ఈ గొడవ ఇలా ఉంటే.. లోపల దిగ్విజయ్‌ సింగ్‌ వద్ద సీనియర్లు ఫిర్యాదులతో భారీగా నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పీసీసీ ఏకపక్ష నిర్ణయాలే లక్ష్యంగా ఫిర్యాదులు వెళ్లాయి. తామెందుకు పీసీస పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో అందరికీ తెలుసని.. ఇదే విషయం అధిష్టానం దృష్టికి తీసుకొచ్చామంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం