చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత.. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే తొలుత పోలీసులు ఈ దీక్షకు అనుమతులు నిరాకరించారు. అయితే జాగృతి సంస్థ ప్రతినిధుల సంప్రదింపులు తర్వాత ఢిల్లీ వెస్ట్‌జోన్ డీసీపీ దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో కవిత దీక్ష యథాతథంగా కొనసాగనుంది.
పోలీసుల నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో దీక్షకు జాగృతి నేతలు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. దాదాపు 6వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఇదిలా ఉంటే దీక్షలో పాల్తొనేందుకు రాష్ట్రం నుంచి మంత్రులు ఢిల్లీ బయలు దేరారు. సీఎం అధ్యక్షన జరిగిన కేబినెట్ మీటింగ్ మధ్యలోనే మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రిరెడ్డి ఢిల్లీ బయలు దేరారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో చేపట్టబోయే నిరాహార దీక్షకు మద్ధతు కూడగట్టే పనిలో పడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగానే సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచురిని కలిశారు. జంతర్ మంతర్ దీక్షకు రావాలని ఏచూరినీ కోరారు. ఓవైపు బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేయడానికి సిద్ధమవుతుంటే.. మరోవైపు బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కవితకు ధీటుగా హైదరాబాద్‌లో భాజపా మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..