తెల్లనివన్నీ పాలుకావు. ఎంబీబీఎస్ అని రాసుకున్నంత మాత్రాన డాక్లర్లు కారు. కామారెడ్డి జిల్లాలో ఇట్టాంటి వ్యవహారమే వ్యవహారం కలకలం రేపింది. షైన్ స్టార్ హాస్పిటల్‌లో తనిఖీలు చేస్తే ఫేక్ డాక్టర్ దగాపర్వం బయటపడింది. మందమర్రి మండలం రామకృష్ణ పూర్‌కు చెందిన రవీందర్… ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్‌తో పెద్ద కథే నడిపాడు. డిగ్రీ ఫెయిల్.. కానీ ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు కటింగ్ ఇస్తూ ఎందర్నో బురిడీ కొట్టించాడు. రవీందర్ అనే రియల్ డాక్టర్ సర్టిఫికెట్లను డూప్లికేటు చేశాడు. అతని ఫోటో వున్న తన ఫోటో అతికించాడు. గాంధీ ఆస్పత్రిలో పనిచేసినట్టు బాగా కవర్ చేశాడు. హాస్పిటల్ యాజమాన్యాలను బురిడీ కొట్టించి గత మూడేళ్లుగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో పనిచేశాడు. దొరికితే దొంగ దొరకనంత వరకు దర్జాగా డాక్టర్ బాబుగా కటింగ్ ఇచ్చాడు. ఇతను రాసిన ప్రిస్కిప్షన్ చూసి… సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అని పసిగట్టిన ఓ వ్యక్తి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకేం అతను పనిచేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి సర్టిఫికెట్లు వెరిఫై చేస్తే అసలు సంగతి బయటపడింది.
దొరకనంత వరకు డాక్టర్‌బాబుగా దర్జా వెలగబెట్టిన ముల్కల రవీందర్..కామారెడ్డి ఖాకీలకు అడ్డంగా బుక్కయ్యాడు. ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్‌గా ఎలా మేనేజ్ చేశాడు. ఆరా తీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. తనిఖీ చేస్తే ఫేక్ ఆధార్ కార్డు, మరికొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ దొరికాయి. అతని దగ్గరి నుంచి సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇతనొక్కడే..ఇతనితో దంటగట్టిన ఇలాంటి బాపతుగాళ్లు ఇంకా వున్నారా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు కామారెడ్డి పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..