Telangana: బంగారం లాక్కుని తల్లిని దట్టమైన అడవిలో వదిలేసి వెళ్లిన కూతురు

నవ మాసాలు మోసి కని.. పెంచి పెద్ద చేసిన తల్లి. ఇప్పుడు జీవిత చరమాంకంలో ఉంది. ఈ సమయంలో ఆమెకు ఆసరాగా ఉండి సాకాల్సిన కూతురు కర్కశంగా వ్యవహరించింది. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లాక్కుని దట్టమైన అడవిలో వదిలేసింది.

Telangana: బంగారం లాక్కుని తల్లిని దట్టమైన అడవిలో వదిలేసి వెళ్లిన కూతురు
Budhavva

Edited By:

Updated on: May 01, 2025 | 9:28 AM

నవ మాసాలు మోసి, కని పెంచిన కూతురు బాగుండాలని కోరుకుంది ఆ వృద్దురాలు. వృద్దాప్యంలో బిడ్డ తనకు ఆసరాగా ఉంటుంది అనుకుంది. కానీ.. కూతురు మాత్రం తల్లి ప్రేమ, వాత్యల్యం కంటే డబ్బే ముఖ్యమని భావించి కర్కషంగా ప్రవర్తించింది. తల్లి వద్ద ఉన్న బంగారాన్ని లాక్కుని.. ఆమెను దట్టమైన అడవిలో తల్లిని వదిలేసింది. తాను ఎక్కడ ఉన్నానో తెలియక ఆ వృద్ధురాలు రెండు రోజులుగా తిండితిప్పలు లేక అపస్మారక స్థితికి చేరుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా వీధిలో నివాసముంటున్న బుధవ్వ, ఈశ్వరి తల్లీ కూతుళ్లు.  నానా కష్టాలు పడి కూతుర్ని పెంచి పెద్ద చేసింది తల్లి. అయితే గత రెండు రోజుల క్రితం ఈశ్వరికి తల్లిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్ను పడింది. ఎలాగైనా ఆ బంగారం చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని దట్టమైన అడవి వద్దకు తల్లిన తీసుకెళ్లింది. అక్కడ బుధవ్వ మెడ నుంచి బంగారు ఆభరణాలను లాగేసింది కూతురు. దట్టమైన అడవిలో వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయింది. అసలు తాను ఎక్కడ ఉందో తెలియలేని బుధవ్వ అదే ప్రాంతంలో గత రెండు రోజులుగా తిరుగుతూ తిండి తిప్పలు నీరు లేక అపస్మారక స్థితికి చేరుకుంది. అటుగా వెళుతున్న యువకులు ఆమెను గమనించి జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే శ్రీరాముల పల్లెలోని సఖి కేంద్రానికి ఆమెను తరలించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  బుధవ్వ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. జీవిత చరమాంకంలో తల్లిని సాకాల్సిన బిడ్డ..  తల్లి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..