Dasoju Sravan: రేవంత్ సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్‌ రాజీనామా..

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.

Dasoju Sravan: రేవంత్ సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్‌ రాజీనామా..
Dasoju Sravan

Updated on: Aug 05, 2022 | 5:49 PM

Dasoju Sravan on Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకునేందుకు.. వ్యక్తిగత ఈమేజ్‌ పెంచుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారంటూ దాసోజు విమర్శించారు. కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారని దాసోజు.. రేవంత్‌ పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కులం, ధనం ప్రధానం అయ్యాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగతొక్కుతున్నారంటూ పేర్కొన్నారు. వ్యాపార, రాజకీయ లబ్ధి కోసమే రేవంత్‌ రెడ్డి ఆరాటపడుతున్నారని దాసోజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దాసోజు పేర్కొన్నారు.

కాగా.. అంతకుముందు దాసోజు శ్రావణ్.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ కీలక నేతలు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. అయితే.. టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఇటీవల కాంగ్రెస్ చేరారు. ఆమె ఖైరతాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ టికెట్ ఆశించి విజయారెడ్డి చేరారన్న కారణంతో దాసోజ్ శ్రవణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..