మా ఇంట్లో చెట్టుకు పండు కోస్తావా…? దళిత బాలుడిపై ప్రభుత్వ రిటైర్డ్‌ టీచర్ దాష్టీకం..

|

Jun 26, 2024 | 12:01 PM

జూన్ 24న బాధితుడి తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి, అతని కుమారుడు బాలుడి తల్లితో నోటీకి వచ్చినట్టుగా మాట్లాడారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

మా ఇంట్లో చెట్టుకు పండు కోస్తావా...? దళిత బాలుడిపై ప్రభుత్వ రిటైర్డ్‌ టీచర్ దాష్టీకం..
Dalit Boy Tied Up And Beate
Follow us on

హైదరాబాద్ శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పక్కింట్లో కనిపించిన దానిమ్మ పండు కోసిన 14 ఏళ్ల దళిత బాలుడిపై దాష్టీకం ప్రదర్శించాడు ఆ ఇంటి యజమాని. పది రూపాయలు విలువ చేసే పండు కోసం ఏకంగా బాలుడిని కట్టేసి చితక్కొట్టారు. జూన్ 22న షాబాద్ మండలం కేసారం గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన బాధిత బాలుడు ఒక ఇంటి కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి ఆ ఇంట్లోని చెట్టుకు దానిమ్మ పండు కోశాడు. అది గమనించిన ఆ ఇంటి యాజమాని బాలుడి కట్టేసి కొట్టాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ఆ ఇంటి యజమాని రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పిల్లలకు పాఠాలు చెబుతూ విద్యాబుద్ధులు నేర్పించే గురువు.. బాలుడు చేసిన చిన్న తప్పుకు అతన్ని పట్టుకుని చేతులు, కాళ్ళు తాడుతో కట్టేసి నేలపై పడేసి కొట్టినట్లుగా బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. బాలుడు నేలపై పడుకున్నట్లు చూపుతున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

జూన్ 24న బాధితుడి తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి, అతని కుమారుడు బాలుడి తల్లితో నోటీకి వచ్చినట్టుగా మాట్లాడారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..