Cyberabad Police: కాలితో నెంబర్‌ ప్లేట్‌ను దాచిన మహిళ.. పవన్‌ డైలాగ్‌తో అవగాహన కల్పించిన పోలీసులు..

|

Feb 03, 2021 | 5:45 AM

పోలీసులు సోషల్‌ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ప్రజల్లో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించే క్రమంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్‌ పోలీసులు...

Cyberabad Police: కాలితో నెంబర్‌ ప్లేట్‌ను దాచిన మహిళ.. పవన్‌ డైలాగ్‌తో అవగాహన కల్పించిన పోలీసులు..
Follow us on

Cyberabad Police Tweet: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఏ విషయాన్నైనా సామాజిక మాధ్యమాల్లోనే చెబుతున్నారు. ఇండస్ట్రీ వర్గాలైతే సినిమా విడుదల తేదీని, కొత్త సినిమా పోస్టర్లను సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా తమ ప్రచారాన్ని సోషల్‌ మీడియాలోనే చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు కూడా సోషల్‌ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ప్రజల్లో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించే క్రమంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్‌ పోలీసులు పోస్ట్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. దీంతో ఎక్కడ ట్రాఫిక్‌ పోలీసులు తీసే ఫొటోకు దొరుకుతామెమోనని వెనకాల కూర్చున్న మహిళ తన కాలితో నెంబర్‌ ప్లేట్‌ను కనిపించకుండా కవర్‌ చేసే ప్రయత్నం చేసింది. అయితే నగర పోలీసులు మాములు వారు కాదు కదా.. ఆ మహిళ నెంబర్‌ను కవర్‌ చేస్తున్న ఫొటోను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అయితే కేవలం ఆ ఫొటోనే కాకుండా.. పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ చెబుతున్నట్లున్న మీమ్‌ని కూడా జత చేశారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. ‘నువ్వేమో రూ.1300 కాపాడదాం అని కాలు పెట్టావ్… కానీ నువ్వు చేసిన ఈ పనికి ఇంకో రూ.1500 ఎక్కువ పడ్డాయి’ అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌తో పాటు రాసుకొచ్చిన.. ‘చలనాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ఒక్కటే ఉత్తమ మార్గం, విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’ క్యాప్షన్‌ హైలెట్‌గా నిలిచింది.

Also Read: స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగాపవర్‌స్టార్.. పోలీసుల కథలంటే ఇష్టమన్న రాంచరణ్