AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyberabad Police: కాలితో నెంబర్‌ ప్లేట్‌ను దాచిన మహిళ.. పవన్‌ డైలాగ్‌తో అవగాహన కల్పించిన పోలీసులు..

పోలీసులు సోషల్‌ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ప్రజల్లో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించే క్రమంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్‌ పోలీసులు...

Cyberabad Police: కాలితో నెంబర్‌ ప్లేట్‌ను దాచిన మహిళ.. పవన్‌ డైలాగ్‌తో అవగాహన కల్పించిన పోలీసులు..
Narender Vaitla
|

Updated on: Feb 03, 2021 | 5:45 AM

Share

Cyberabad Police Tweet: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఏ విషయాన్నైనా సామాజిక మాధ్యమాల్లోనే చెబుతున్నారు. ఇండస్ట్రీ వర్గాలైతే సినిమా విడుదల తేదీని, కొత్త సినిమా పోస్టర్లను సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా తమ ప్రచారాన్ని సోషల్‌ మీడియాలోనే చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా సోషల్‌ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ప్రజల్లో ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించే క్రమంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్‌ పోలీసులు పోస్ట్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. దీంతో ఎక్కడ ట్రాఫిక్‌ పోలీసులు తీసే ఫొటోకు దొరుకుతామెమోనని వెనకాల కూర్చున్న మహిళ తన కాలితో నెంబర్‌ ప్లేట్‌ను కనిపించకుండా కవర్‌ చేసే ప్రయత్నం చేసింది. అయితే నగర పోలీసులు మాములు వారు కాదు కదా.. ఆ మహిళ నెంబర్‌ను కవర్‌ చేస్తున్న ఫొటోను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అయితే కేవలం ఆ ఫొటోనే కాకుండా.. పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ చెబుతున్నట్లున్న మీమ్‌ని కూడా జత చేశారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. ‘నువ్వేమో రూ.1300 కాపాడదాం అని కాలు పెట్టావ్… కానీ నువ్వు చేసిన ఈ పనికి ఇంకో రూ.1500 ఎక్కువ పడ్డాయి’ అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌తో పాటు రాసుకొచ్చిన.. ‘చలనాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్‌ నియమాలు పాటించడం ఒక్కటే ఉత్తమ మార్గం, విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’ క్యాప్షన్‌ హైలెట్‌గా నిలిచింది.

Also Read: స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగాపవర్‌స్టార్.. పోలీసుల కథలంటే ఇష్టమన్న రాంచరణ్

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..