Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్లు.. ఒక్క ఫోన్‌కాల్‌ చేసి రూ. 83 లక్షలు కాజేశారు.. పూర్తివివరాలు తెలిస్తే షాక్ అవుతారు..

Cyber Crime: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్ సంస్థకు భారీ కుచ్చుటోపి పెట్టారు. దాదాపు...

Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్లు.. ఒక్క ఫోన్‌కాల్‌ చేసి రూ. 83 లక్షలు కాజేశారు.. పూర్తివివరాలు తెలిస్తే షాక్ అవుతారు..
Cyber Crime

Updated on: Jun 25, 2021 | 9:33 AM

Cyber Crime: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్ సంస్థకు భారీ కుచ్చుటోపి పెట్టారు. దాదాపు ముప్పై లక్షలు టోకరా వేశారు. హిమాయత్ నగర్ మణప్పురం గోల్డ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేశాడు. తాను సంస్థ ఉన్నతాధికారినంటూ చెప్పి వారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ తీసుకున్నాడు. అలా సేకరించిన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో రూ. 30 లక్షలు కాజేశాడు. ఇలా ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. ఇరువురి ఐడీల నుంచి లాగిన్ అయి.. రూ. 15 లక్షలు చొప్పున మొత్తం రూ. 30 లక్షలు కాజేశారు. ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారులు గ్రహించి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలాఉంటే.. మసాబ్ ట్యాంక్‌కు ప్రాంతానికి చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్రాలజీ సంస్థ ఎండీనీ సైతం ఇలాగే బురిడీ కొట్టించారు సైబర్ దొంగలు. నిమ్రా సంస్థ యజమాని ఖాదర్‌ను తప్పుదోవ పట్టించి రూ. 53 లక్షలు కొట్టేశారు. మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థతో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే, రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్‌ని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. సంస్థ అధికారులమని, డబ్బును లండన్‌లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈమెయిల్ పంపించారు కేటుగాళ్లు. వారి మాటలు నమ్మిన ఖాదర్.. మొత్తం రూ. 53 లక్షల 23 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మెటీరియల్ విషయమై సంస్థ అసలు అధికారులను సంప్రదించడంతో మోసం బయటపడింది. దాంతో బాధితుడు ఖాదర్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసులను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!

Loading...
Unable to load recommendations.
Follow Us