Covid-19 Case: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకుంటే తాజాగా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో 33 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించి కరోనా పరీక్షలు చేయగా, మొత్తం 33 పాజిటివ్ కేసులు బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో కరోనా పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది మొదటి రోజు 16 కేసులు, రెండో శుక్రవారం 17మందికి పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
అయితే గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బంధువులు ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత వారిలో ఒకరికి కరోనా సోకగా, గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. దీంతో రెండు రోజుల పాటు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 33 మందికి కరోనా నిర్ధారణ అయింది.
పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి అవసరమైన మందులను అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు కరోనా రోగులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. కేవలం అత్యక్రియలకు వెళ్లడం వల్లే పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 54 మందికి కోవిడ్ పాజిటివ్