మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను సమైక్యవాదులు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.. ఏడాది నుంచి తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక.. సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. సీఎం కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో బీజేపీ దత్త పుత్రిక షర్మిల..కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేస్తోస్తుదని మండిపడ్డారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఎలాంటి అరాచకాలు లేకుండా పాలన సాగుతోందన్నారు. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు గుత్తా సుఖేందర్‌రెడ్డి.
అవినీతికి పాల్పడి వారు జైలుకు వెళ్లడమే కాకుండా..IAS అధికారులను సైతం జైలుకు పంపించారని విమర్శలు గుప్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం