Telangana: థర్డ్ వేవ్ మొదలైంది.. కార్యక్రమాలు రద్దు చేసుకోండి.. డీహెచ్ శ్రీనివాసరావు

|

Jan 06, 2022 | 2:48 PM

Telangana Health Director Srinivasa Rao: దేశంలో ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Telangana: థర్డ్ వేవ్ మొదలైంది.. కార్యక్రమాలు రద్దు చేసుకోండి.. డీహెచ్ శ్రీనివాసరావు
Dr G Srinivasa Rao
Follow us on

Telangana Health Director Srinivasa Rao: దేశంలో ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులను దృష్టిలో ఉంచుకొని కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను సైతం విడుదల చేశాయి. తెలంగాణలోనూ కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కూడా థర్డ్ వేవ్ మొదలైందంటూ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నిన్న ఒక్కరోజే లక్షకు చేరువలో కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొన్నారు. దేశంలోని 15 రాష్టాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 1600 కేసులు నిన్న నమోదయ్యాయని.. జీహెచ్‌ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దేశంలో 2 నుంచి 6 రేట్లు కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో బెడ్ల కొరత లేదన్నారు.

కోవిడ్ బారిన పడిన వాళ్లు దాదాపు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని తెలిపారు. కరోనా లక్షణాలుంటే.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఐదురోజులుగా 4 రెట్లకుపైగా కేసులు వస్తున్నాయన్నారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే.. ఒమిక్రాన్ కేసులు వివరాలు ఇకపై రోజు వారి హెల్త్ బులిటెన్లో ఇవ్వమంటూ స్పష్టంచారు.

ఒమిక్రాన్ వైరస్ ప్రజా సమూహంలోకి వెళ్లిందని.. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని పేర్కొన్నారు. అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు ముఖ్యమంటూ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని తెలిపారు.

Also Read:

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ఎన్నికల వాయిదానే శ్రేయస్కరమా.?

Khalistan Terror Group Warns: ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది.. ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ వార్నింగ్..