
తెలంగాణలో పురపాలక ఎన్నికల నగారా మోగింది.. టికెట్ల వేట మొదలైంది.. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డామని, ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఆశించిన ఒక మహిళా నేతకు అధిష్టానం షాక్ ఇచ్చింది. కౌన్సిలర్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె వెక్కి వెక్కి ఏడ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది..
గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీకి సేవ చేస్తున్న ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ లో తనకు కాంగ్రెస్ పార్టీ తనకు బీఫామ్ ఇవ్వకపోవడంతో బోరున వినిపిస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భూక్య సరోజన అనే మాజీ కౌన్సిలర్ టికెట్ అశించి భంగపడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 14వ వార్డు మాజీ కౌన్సిలర్ భుక్య సరోజన తనకు మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను గత 20 సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేస్తున్నానని, కరోనా టైంలో తన 14వ వార్డులో ఆశా వర్కర్లు లేకున్నా తానే 60 మంది కరోనా పేషంట్లను దగ్గరుండి చూసుకున్నానని గుర్తు చేశారు.
20 సంవత్సరాలుగా పార్టీలో ఉండే సేవలు చేస్తున్న తనను కాదని వేరే పార్టీ నుండి వలస వచ్చిన వాళ్లకే కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ లు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జెండా లేకుంటే తాను లేనని వెక్కి వెక్కి ఏడ్చారు. తన అమ్మా, నాన్న తన నుండి దూరమైనప్పుడు తనకు ఎంత బాధేసిందో ఇప్పుడు అంతే బాధేస్తుందని మాజీ కౌన్సిలర్ భూక్య సరోజన బోరున విలపించింది. రాజకీయాలు అంటేనే సమీకరణాలు.. లెక్కలు కుదిరితేనే టికెట్. కానీ, కొందరు నాయకులు మాత్రం పార్టీపై నమ్మకంతో ఏళ్ల తరబడి గ్రౌండ్ లెవల్‌లో పని చేస్తుంటారు. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల వేళ టికెట్ల ప్రకటన రాగానే కొందరిలో ఆనందం వెల్లివిరిస్తే, మరికొందరిలో ఆవేదన పెల్లుబికింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..