Telangana Polls 2023: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఎన్ని..? లెక్క చెప్పిన కేంద్ర మాజీ మంత్రి..

తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది.. గురువారం పోలింగ్ జరగనుంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. పొలిటికల్ హీట్ నెలకొంది.. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ దే విజయమంటూ ఆశాభావం వ్యక్తంచేశారు.

Telangana Polls 2023: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఎన్ని..? లెక్క చెప్పిన కేంద్ర మాజీ మంత్రి..
Bjp - Congress - BRS
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2023 | 12:21 PM

తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది.. గురువారం పోలింగ్ జరగనుంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. పొలిటికల్ హీట్ నెలకొంది.. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ దే విజయమంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 83 స్థానాల్లో గెలిచి.. అధికార పగ్గాలు హస్తగతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. అధికార బీఆర్ఎస్‌ కేవలం 24 స్థానాలకు పరిమితం అవుతుందన్నారు. అలాగే.. ఎంఐఎం కు 7 స్థానాలు, బిజేపీ 4 స్థానాలు, సీపీఐ ఒక చోట గెలుస్తుందంటూ.. అంకెలతో చింతా మోహన్ తనదైన శైలిలో జోస్యం చెప్పారు. సర్వేలలో ఇదే తేలిందంటూ చింతా మోహన్ చెప్పుకొచ్చారు. ఈ సర్వే ఫలితాలు రేపు తెలంగాణ ఎన్నికల్లో కనిపిస్తాయంటూ వివరించారు. తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానంటున్న ప్రధాని మోదీ.. ఆ పార్టీ గెలిచే 4 సీట్లతో ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.

అంతేకాకుండా చింతా మోహన్ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీల సీట్ల అమ్మకంలో రాష్ట్రంలో రూ.500 కోట్ల స్కాం జరిగిందంటూ ఆరోపించారు. నంద్యాల, రాజమండ్రి, విజయనగరం ప్రైవేట్ మెడికల్ ల్లో 152 ఎండి, ఎంఎస్ పీజీ సీట్లను అమ్ముకున్నారంటూ పేర్కొన్నారు. ఎంసీఐ అనుమతి లేకుండా పీజీ సీట్లను దొంగచాటుగా అమ్ముకున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..