
Huzurabad Congress Candidate: ఎట్టకేలకు హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. సుదీర్ఘ కసరత్తు తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికకు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట నర్సింగరావు పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. అభ్యర్థి ఎంపికపై శుక్రవారం జరిగిన చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే, టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో బల్మూరు వెంకట్ పేరును కాంగ్రెస్ ముఖ్యులు ప్రతిపాదించారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి సిఫార్సు చేసింది.
రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం బల్మూరు వెంకట్ పేరును ఖరారు చేసింది.
Huzurabad Congress
Read Also… YCP vs Janasena: ఏపీలో గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు..!