MLA Seethakka: ఆ పదం విని బాధగా అనిపించింది.. అందుకే రాజీనామా చేశా.. ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Dec 22, 2022 | 3:49 PM

తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఈ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ కోసం అందరూ పనిచేస్తున్నామని ఈగోలు పక్కనబెట్టి...

MLA Seethakka: ఆ పదం విని బాధగా అనిపించింది.. అందుకే రాజీనామా చేశా.. ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Mla Seethakka
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఈ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ కోసం అందరూ పనిచేస్తున్నామని ఈగోలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. సీఎల్పీ చెప్పినట్లే చేశామన్న ఆమె.. పార్టీలో తనవంతు పాత్రను తాను పోషిస్తానని చెప్పారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం సీతక్క ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పాత వాళ్లు, కొత్త వాళ్లు ఎవరిదైనా తప్పు ఉంటే మాత్రం వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వలసవాదులు అనే మాట తనను బాధించిందన్న సీతక్క.. కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నట్లు వివరించారు. వలసవాదులు అనే పదానికి మాత్రమే తాను బాధపడి రాజీనామా చేసినట్టుగా స్పష్టం చేశారు.

కాగా.. తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అనిశ్చితిని చక్కదిద్దేందుకు సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్‌ రంగంలోకి దిగారు. గాంధీ భవన్‌లో పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. కాగా.. టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని సీనియర్‌ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో కొద్ది రోజుల క్రితం 13 మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. అయితే, తమకు పదవులు ముఖ్యం కాదని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే పనిచేస్తామని సీతక్క స్పష్టం చేశారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా తమ రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ కు పంపారు. అయితే కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఈ నాయకులంతా ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో సమావేశమవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..