సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఉతీర్ణతపై నెలకొన్న గందరగోళానికి పుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లి తండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. కరోనాతో విద్యార్థుల చదువులు చాలా గందరగోళంగా మారిన ఈ పరిస్థితి నెలకొందన్నారు. దీనికి తోడు ఆన్ లైన్ చదువుల్లో సరిగ్గా చదవలేక పోయారని.. ఇలాంటి సమయంలో ముందు ప్రమోట్ చేసి ఇప్పుడు పరీక్షలు పెట్టడం .. ఆ తర్వాత పెయిల్ చేయడం సరికాదన్నారు. పేయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పదుతున్నారని.. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్తు కోసం కనీసం పాస్ మార్కులు వేయాలన్నారు. ప్రభుత్వం 12 గంటల్లో సానుకూలం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే గురువారం ఇంటర్ బోర్డు ముందు దీక్షకు కూర్చుంటామన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విద్యా మంత్రి సబిత విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.
అందరికీ షాకిచ్చేలా వచ్చిన తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్… తీవ్ర దుమారం రేపుతున్నాయి. సగంమందికి పైగా విద్యార్థులు ఫెయిలవడం విస్మయానికి గురిచేసింది. అయితే, దీనికి బోర్డు నిర్లక్ష్యమే కారణమంటూ… విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టడంతో రగడ మొదలైంది. ఇప్పుడు ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుండటంతో… వివాదం మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Honey for Skin: పట్టులాంటి చర్మం కోసం తేనెను ఉపయోగించండి.. ఎలా వాడాలో తెలుసుకోండి..