Warangal Congress: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న కార్యకర్తలు..

ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు ఒకరినొకరు దాడి చేసుకున్నారు.

Warangal Congress: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న కార్యకర్తలు..
Warangal Congress

Updated on: May 31, 2023 | 1:45 PM

ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు ఒకరినొకరు దాడి చేసుకున్నారు. బుధవారం అబ్నుస్ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియామిస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించారు.

అయితే, ఈ ప్రమాణ స్వీకరానికి కొండా సురేఖను పిలవకపోవడంతో ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అబ్నూస్ పంక్షన్ హాల్ లో కొండా మురళి-సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయుల కొట్లాట జరిగింది. ఇరువర్గాల కార్యకర్తలు.. పరస్పరం చేయిచేసుకున్నారు. అంతటితో ఆగకుండా చెప్పులతో దాడి చేసుకున్నారు.

వీడియో..

ఇవి కూడా చదవండి

ఎప్పటినుంచో ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి బాహబాహికి దిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. రాహుల్ సభకు ముందు కూడా వరంగల్ కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us