Priyanka Gandhi: ప్రియాంకకి పోచంపల్లి పట్టుచీరను గిఫ్ట్‌గా ఇచ్చిన భట్టి.. వందేళ్ల చరిత్ర గల పోచంపల్లి కళాకారుల గురించి మీకు తెలుసా..!

|

May 09, 2023 | 1:05 PM

‘సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ గా పేరు గాంచిన పోచంపల్లిని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి బెస్ట్ పర్యాటక ప్రాంతంగా ఎంపిక చేసింది. అరబ్‌ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన ఈ గ్రామం.. ఇప్పుడు చేనేత చీరలు, పట్టు, సీకో పట్టు వంటి చీరలను ఎగుమతి చేస్తూ ప్రఖ్యాతిగాంచింది.

Priyanka Gandhi: ప్రియాంకకి పోచంపల్లి పట్టుచీరను గిఫ్ట్‌గా ఇచ్చిన భట్టి.. వందేళ్ల చరిత్ర గల పోచంపల్లి కళాకారుల గురించి మీకు తెలుసా..!
Pochampalli Sarees
Follow us on

హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌నకు హాజరైన కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీకి అందమైన పోచంపల్లి పట్టుచీరను గిఫ్ట్ గా అందుకున్నారు. యువ సంఘర్షణ సభలో ప్రియాంక కు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పోచంపల్లి చీరను అందించారు.. అంతేకాదు ఈ సందర్భంగా వందేండ్ల చరిత్ర పోచంపల్లి కళాకారుల ప్రతిభ, చేనేత చీర, చేనేతకళాకారుల పనితనం, మగ్గం, కార్మికుల కష్టం, పోచంపల్లి వస్త్రాలు, డిజైన్లపట్ల విదేశీయులు చూపించే ఇష్టం గురించి ప్రియాంకకు వివరించారు భట్టి.

పోచంపల్లి చీర ప్రత్యేకత  ఏమిటంటే?

భారతీయను ,సాంప్రదాయాన్ని తెలియజేది చీర. మగువ మనసు దోచే చీరలు పట్టు, కాటన్, బెనారస్, మంగళగిరి వంటి ఎన్నో రకాలున్నా శుభకార్యాలకు, పండగలు, పర్వదినాలు పట్టుచీరలు వెరీ వెరీ స్పెషల్. పట్టుచీరల్లో పోచంపల్లి పట్టుచీరలు విశ్వవ్యాప్తంగా విశిష్టత ఉంది. తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో భారీ సంఖ్యలో చేనేత కార్మికులున్నారు. ఇక్కడ గ్రామంలోని వారు మగ్గాలపై ప్రత్యేకంగా పట్టుచీరలు తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసిన చీరలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ విదేశాల్లో కూడా ఖ్యాతిగాంచాయి. అసలు పోచంపల్లి చీరలు, పంజాబీ డ్రెస్ లు, లంగా వోణి లు మాత్రమే కాదు దుప్పట్టాలకు కూడా ప్రత్యేక ఉంది. మగువులు ఎంతో ఇష్టంగా వీటిని ధరిస్తారు.

ఇవి కూడా చదవండి

సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా

‘సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ గా పేరు గాంచిన పోచంపల్లిని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి బెస్ట్ పర్యాటక ప్రాంతంగా ఎంపిక చేసింది. అరబ్‌ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన ఈ గ్రామం.. ఇప్పుడు చేనేత చీరలు, పట్టు, సీకో పట్టు వంటి చీరలను ఎగుమతి చేస్తూ ప్రఖ్యాతిగాంచింది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోనే తయారు అయ్యేవి.. ఇప్పుడు ఇంద్రధనస్సుని మరపించే రంగుల కలయికతో చేనేత చీరలను తయారు చేస్తున్నారు. సరికొత్త డిజైన్లతో అందమైన రంగులతో మగువ మనసు దోచే విధంగా చీరలను తయారు చేస్తున్నారు. వాస్తవానికి

నిజాం కాలం నుంచే

పోచంపల్లి గ్రామంలో నిజాం కాలం నుంచే బట్టలను తయారు చేస్తున్నారు. మొదట్లో సహజమైన రంగులతో టై అండ్ డై పద్దతిలో మగ్గాల మీద కార్మికులు రుమాళ్ళు తయారు చేసేవారు. వాటిని అప్పట్లో అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు.

‘జాగ్రఫికల్‌ ఇండికేషన్‌’ లో

కాలక్రమంలో పట్టు చీరల నేతపై పట్టు సాధించారు. 1970 తర్వాత పట్టు చీర నేతలో టై అండ్ డై చేర్చి సరికొత్తగా చీరలను ఆవిష్కరించారు. సరికొత్త శైలితో పట్టుచీరలు ఆవిష్కరించి దేశంలో ప్రసిద్ధి చెందిన చేనేత చీరల్లో ఒకటిగా గాంచింది. 20 ఏళ్లు క్రితం.. పోచంపల్లి కార్మికుల ప్రతిభతో టై అండ్‌ డై’లో ‘జాగ్రఫికల్‌ ఇండికేషన్‌’ లో గుర్తింపు సాధించింది.

పోచంపల్లి చీరల్లో సరికొత్త ఆవిష్కరణలతో చేనేత కార్మికులు విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగాంచడం మాత్రమే కాదు.. పద్మశ్రీ వంటి పురష్కరాలను అందుకున్నారు. వందేండ్ల చరిత్ర ఉన్న పోచంపల్లి చీరలు విదేశీ మగువుల మనసుని దోచుకుంటున్నాయి. విదేశాలకు సైతం ఎగుమతి అవున్నాయి. పోచంపల్లి పట్టు చీరలు సుమారు రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..