Telangana Congress: టార్గెట్ 14.. తెలంగాణ నేతలతో ఏఐసీసీ పెద్దల కీలక సమావేశం.. ఆ విషయంపైనే చర్చ
తెలంగాణలో విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ లోక్‌సభ సమన్వయ కర్తలతో ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది అధిష్ఠానం. రానున్న ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై సమావేశంలో చర్చించారు నేతలు..
తెలంగాణలో విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ లోక్‌సభ సమన్వయ కర్తలతో ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది అధిష్ఠానం. రానున్న ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై సమావేశంలో చర్చించారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తెలంగాణలోని 17 స్థానాలకు..14 మంది కోఆర్డినేటర్లను నియమించింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి శ్రీనివాసరెడ్డికి రెండేసి లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా నేటి సమావేశంలో.. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంపై అధిష్టానం నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద టార్గెట్ 14 గా పెట్టినట్లు తెలుస్తోంది.. ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం..
మరోవైపు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుండి 13 నుంచి 14 సీట్లు గెలవబోతున్నామన్నారు.. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్టు చెప్పారు. ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని నేతలంతా పనిచేస్తామన్నారు.. మరో మంత్రి సీతక్క. త్వరలో అభ్యర్థుల పేర్లు అధిష్ఠానానికి నివేదిస్తామని.. ఫిబ్రవరి లోపు ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని చెప్పారు.
ఏపీపై ఫోకస్..
ఇక దక్షిణాదిలో కర్నాటక , తెలంగాణ విజయంతో ఇప్పుడు ఏపీపై కూడా దృష్టి పెట్టింది..కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ..ఏపీలో ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలో తొలిసారి పర్యటించారు. విజయవాడలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీలో కొత్త చేరికలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. వైసీపీ, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు మాణిక్కం ఠాగూర్. నేటి సమావేశంలో ఆయా అంశాలపై రాష్ట్ర నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..