Telangana: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ ఫోకస్‌.. ఆరు గ్యారంటీల అమలుపై కసరత్తు

|

Jan 07, 2024 | 7:47 AM

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కంటిన్యూ చెయ్యాలని భావిస్తోంది. ఈసారి 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పీసీసీ నేతలు.. మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా కూడా నియమించారు. వీలైనంత త్వరగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి.. వాటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్‌ ప్లా..

Telangana: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ ఫోకస్‌.. ఆరు గ్యారంటీల అమలుపై కసరత్తు
CM Revanth Reddy
Follow us on

కాంగ్రెస్‌ పార్టీ దూకుడును కొనసాగిస్తోంది. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ.. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవాలని పక్కా ప్లాన్‌ను అమలు చేస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి చైర్మన్‌గా తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీని ప్రకటించింది అధిష్ఠానం. లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ ఫోకస్ పెట్టింది. వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్‌ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. సీఎం రేవంత్‌తో పాటు మొత్తం 25 మందికి కమిటీలో చోటు కల్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పలువురు సీనియర్‌ నేతలకు ఈ కమిటీలో అవకాశం దక్కింది. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా యూత్‌ కాంగ్రెస్‌, NSUI, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఛాన్స్‌ ఇచ్చారు.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కంటిన్యూ చెయ్యాలని భావిస్తోంది. ఈసారి 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పీసీసీ నేతలు.. మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా కూడా నియమించారు. వీలైనంత త్వరగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి.. వాటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్‌ ప్లాన్‌.

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేనప్పటికీ.. మొత్తం 17 నియోజకవర్గాల్లో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం మొదలుపెట్టాలని ప్లాన్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. 12 స్థానాలు గెలుస్తామని, గట్టిగా కష్టపడితే 15 స్థానాలూ సాధ్యమేనని లెక్కలు వేస్తోంది. మరి, మున్ముందు కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి