ఇదేంటి సామి.. కమ్మని బ్రేక్‌ఫాస్ట్ కోసం కోచింగ్.. ఇడ్లీ, దోసె ఎలా చేయాలో నేర్పిస్తున్నారు.. ఎక్కడంటే?

కడుపు నింపుకొని మనం తినే తిండి ఎంత ముఖ్యమో.. దాన్ని అంతే రుచిగా, పది మంది మెచ్చేలా వండడం కూడా అంతే ముఖ్యం. ఎవరైనా కమ్మని భోజనం పెడితే భలే ఉందే, ఎంత బాగా చేశారో అని సంబరపడతాం. అంటే మనం తినే ఆహరం వల్ల కడుపు నిండడం ఒకటే ముఖ్యం కాదు.. మనసు కూడా నిండాలి. అలా ఒక యువకుడు కమ్మని బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో పది మందికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదేంటి సామి.. కమ్మని బ్రేక్‌ఫాస్ట్ కోసం కోచింగ్..  ఇడ్లీ, దోసె ఎలా చేయాలో నేర్పిస్తున్నారు.. ఎక్కడంటే?
Breakfast Coaching

Edited By:

Updated on: Dec 21, 2025 | 5:16 PM

కడుపు నింపుకొని మనం తినే తిండి ఎంత ముఖ్యమో.. దాన్ని అంతే రుచిగా, పది మంది మెచ్చేలా వండడం కూడా అంతే ముఖ్యం. ఎవరైనా కమ్మని భోజనం పెడితే భలే ఉందే, ఎంత బాగా చేశారో అని సంబరపడతాం. అంటే మనం తినే ఆహరం వల్ల కడుపు నిండడం ఒకటే ముఖ్యం కాదు.. మనసు కూడా నిండాలి. అలా ఒక యువకుడు కమ్మని బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో పది మందికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటీ, వంటలు ఎలా చేయాలో కూడా చెప్పేవాళ్లు ఉన్నారా..? విచిత్రంగా ఉంది కదూ.. అందుకే ఆ విశేషాలు, కథాకమామీషు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

ఎక్కడైనా సివిల్ సర్వీసెస్, పోలీస్ రిక్రూట్‌మెంట్, ఆర్మీ లేదా వ్యక్తిత్వ వికాసం ఇలాంటి విషయల్లో కోచింగ్ సెంటర్‌లు ఉండడం చూశాం. పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ, జనాలకు అవకాశాలు ఇప్పిస్తూ ముందుకు తీసుకెళ్లే శిక్షణ తరగతులు ఉండడం కూడా చూశాం. కానీ, మొట్టమొదటిసారిగా బ్రేక్‌ఫాస్ట్ కోచింగ్ అనే కొత్త ఒరవడి మొదలైంది. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో కుమార్ అనే యువకుడు అల్పాహారం సరైన విధంగా ఎలా వండాలో చెబుతూ కోచింగ్ నిర్వహిస్తున్నాడు. ఇది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. అందరూ వ్యక్తిత్వ వికాసం, కెరీర్ డెవలప్‌మెంట్ కోర్సులు చెబుతూ ఉంటే.. కుమార్ ఇడ్లీ, దోస, వడ, ఉప్మా, పరాఠా వంటి రోజువారీ అల్పాహారాలు తయారు చేయడంలో నైపుణ్యాలను బోధిస్తున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే ఎంతో మందికి, అనుభవం లేక దెబ్బతినే వారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తూ జీవనోపాధికి మార్గం చూపుతున్నాడు.

కుమార్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని. అక్కడ కుమార్ కుటుంబం ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడిపేది. కానీ, వంట చేయడానికి పెట్టుకున్నవాళ్లు వారిని మోసం చేయడంతో వ్యాపారం ముందుకు సాగలేదు. మొదట్లో బిజినెస్ బాగానే నడిచినప్పటికీ, క్రమంగా వ్యాపారం నష్టాల పాలయింది. 15 ఏళ్ల క్రితం ఆ కుటుంబం హైదరాబాద్‌కు మారినప్పుడు కూడా ఇదే సమస్య వారిని మరింత వెంటాడింది. నగరంలో వ్యాపారం చేద్దామని అనుకుని అమీర్‌పేటలో మొదలుపెట్టిన వారి టిఫిన్ సెంటర్ కూడా ఇదే కారణంతో తొందరలోనే మూసివేయాల్సి వచ్చింది. నైపుణ్యం కలిగిన వంటవాళ్లను పెట్టుకోవడం, వాళ్లను కొనసాగించడం.. కస్టమర్ల అభిమానాన్ని చూరగొనడం అంత తేలిగ్గా జరిగే పని కాదని తేలిపోయింది. ఆ తర్వాత బాలానగర్‌లోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాంత సమీపంలో ఉన్న మరో అవుట్‌లెట్‌లో కూడా ఇలాంటి సంక్షోభమే తలెత్తినప్పుడు కుమార్ తన విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తాను నమ్ముకున్న వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏదో కొత్తగా చేయాలని భావించాడు. బయటి చెఫ్‌లపై ఆధారపడకుండా, అతను ఆ నైపుణ్యాన్ని స్వయంగా నేర్చుకున్నాడు. అల్పాహారానికి ఉపయోగించే పిండి ఎలా ఉండాలి.. ఎలా కలిపితే రుచిగా ఉంటుంది.. ఎంతసేపు నానబెట్టాలి ఇలాంటి విషయాలపై పట్టు సాధించాడు. తనలాంటి చాలా మంది చిన్న వ్యాపారస్తులు బయట వంటవాళ్ల మీద ఆధారపడటం వల్ల తాను ఎదుర్కొన్న సవాళ్లనే ఎదుర్కొంటున్నారని గ్రహించాడు. దీని కోసం సోషల్ మీడియాని ఆశ్రయించాడు. YouTube మరియు Instagram వీడియోల ద్వారా తన నైపుణ్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టాడు.

వంట విధానంలో పాటించే చిట్కాలు, వండే విధానాలు ఇలా అన్నిటి గురించి వివరిస్తూ కోచింగ్ పద్దతిలో తన ప్రయత్నాలు చేస్తూ వెళ్లాడు. అలా పుట్టిన ఆలోచనలతో నేడు ఎంతో మంది ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాడు.. వాళ్లు వ్యాపార విషయంలో జీవనోపాధి పొందేలా తోడుగా నిలుస్తున్నాడు. కుమార్ వద్ద శిక్షణ పొందిన వారిలో చాలా మంది ఇప్పటికే ఫుడ్ జాయింట్‌లతో పని చేస్తున్నారు. మరికొందరు హైదరాబాద్ అంతటా తమ సొంత టిఫిన్ సెంటర్‌లను ప్రారంభించారు. కొందరు ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మెరుగుపరుచుకున్నారు. వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నారు. తనకు వచ్చిన చిన్న ఆలోచనతో ఎంతో మందికి జీవనోపాధి కల్పించి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..