సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపరమైన అంశాల్లో దూకుడు పెంచారు. అనేక శాఖలకు సంబంధించి రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదట వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై రివ్యూ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్లపై ఆరా తీశారు. పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఆ తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ మీద అధికారులతో చర్చించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంతో.. వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, ఐ.టి మరియు పరిశ్రమల శాఖ… pic.twitter.com/LolI2qruVY
— Telangana CMO (@TelanganaCMO) December 11, 2023
రాష్ట్ర నీటి పారుదలశాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా అధికారులతో రివ్యూ చేశారు. తెలంగాణలో నీటిపారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉందని.. ప్రజల డబ్బులతో ప్రాజెక్టులను కడుతున్నామని అన్నారు. అత్యంత పారదర్శకంగా పనులు ఉండాలని.. అపోహలు తొలగిపోయేలా పని చేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిపారు.
వ్యవసాయశాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమానికి అధికారులు పని చేయాలని.. మంచి పద్ధతులు, టెక్నాలజీ సాయంతో అధిక దిగుబడి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కృషి చేయాలని అన్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..