Revanth Reddy: ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో కమిటీ..

|

Jan 08, 2024 | 9:46 PM

ఆరు గ్యారంటీల అమలే లక్ష్యం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అసలైన లబ్ధిదారులకు అందించడమే ప్రధాన అజెండా అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రాసెస్‌లో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. అదే సమయంలో ఆరోపణలు చెప్తున్న ప్రతిపక్షాలను గట్టిగా తిప్పికొడుతోంది ప్రభుత్వం.. సోమవారం ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయిసమీక్ష జరిగింది.

Revanth Reddy: ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో కమిటీ..
Revanth Reddy
Follow us on

ఆరు గ్యారంటీల అమలే లక్ష్యం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అసలైన లబ్ధిదారులకు అందించడమే ప్రధాన అజెండా అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రాసెస్‌లో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. అదే సమయంలో ఆరోపణలు చెప్తున్న ప్రతిపక్షాలను గట్టిగా తిప్పికొడుతోంది ప్రభుత్వం.. సోమవారం ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయిసమీక్ష జరిగింది. ఆరు గ్యారంటీల అమలు మార్గదర్శకాల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటితో పాటు పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి.. పథకాలు అమలుచేయడం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

అభయహస్తం పథకాల కోసం కోటీ 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక భూ సమస్యలు, రేషన్ కార్డులకు సంబంధించి మరో 20 లక్షల వరకూ దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా కోటీ 25లక్షల మంది ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులే అయింది. ఇంతలోనే తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 25 లేదా 30వ తేదీలోపు డేటా ఎంట్రీ పూర్తి చేసి.. అసలైన అర్హులను గుర్తించి పథకాలు అమలుచేస్తామంటోంది ప్రభుత్వం. ప్రతి హామీని అమలుచేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంటే.. ప్రతిపక్షాలు తట్టుకోలేకే తమపై ఆరోపణలు చేస్తున్నాయంటూ మంత్రులు మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..