Rythu Bharosa: రైతు భరోసా, కొత్త ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..

తెలంగాణలో రైతు భరోసా నిధులు, కొత్త ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ అయింది. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. ఇక కొత్త ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు మంజూరు అవుతాయనే దానిపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

Rythu Bharosa: రైతు భరోసా, కొత్త ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
Farmers

Updated on: Feb 05, 2026 | 12:58 PM

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. జనవరిలో సంక్రాంతి పండుగకు ముందే జమ చేయాల్సి ఉన్నప్పటికీ.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఫిబ్రవరి తొలివారంలో అయినా జమ అవుతాయని భావించిన రైతులకు నిరాశై ఎదురైంది. వీటిని ఎప్పుడు జమ చేస్తామనే దానిపై స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక కొత్త ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రాష్ట్రంలోని చాలామంది ప్రజలు ఎదురూచూస్తుండగా.. రెండో విడత లబ్దిదారుల జాబితా విడుదలపై కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. ఇలా ప్రజలకు రెండు పథకాలపై తాజాగా రేవంత్ స్పష్టతిచ్చారు.

రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే..?

తెలంగాణలో రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మిర్యాలగూడ మండలం గూడూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్నిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. మున్నిపల్ ఎన్నికల వల్ల విడుదల చేయడం లేదని, ఎన్నికలు ముగిసిన అనంతరం రైతుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రైతులకు ఇప్పటివరకు రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. అలాగే రైతులు పండించే సన్నబియ్యంకు క్వింటాకు రూ.500 బోనస్ ఎప్పటికప్పుడు అందించినట్లు చెప్పారు. అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ప్రారంభించి రాష్ట్రలోని ప్రజలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 11న 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 13న ఫలితాలు విడుదల కానునన్నాయి. దీంతో ఫిబ్రవరి చివరికల్లా రైతు భరోసా డబ్బులు విడుదల చేసే అవకాశముంది.

ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా ఎప్పుడంటే..?

ఇక కొత్త ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై కూడా సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్‌లో కొత్త ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించున్నట్లు తెలిపారు. త్వరలోనే రెండో విడత లబ్దిదారుల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న బడ్జెట్‌లో ఇందుకు తగ్గట్లు నిధుల కేటాయించనున్నామన్నారు. రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసంర లేదన్నారు. విడతల వారీగా ఈ ఐదేళ్లల్లో అర్హులైన ప్రతీఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కాగా మున్సిపల్ ఎన్నికల్లో తమ అభివృద్ది చూసి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. మున్నిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు.