సీఎం కేసీఆర్‌ కరీంనగర్ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఆ పర్యటన వాయిదా పడినట్టు....

సీఎం కేసీఆర్‌ కరీంనగర్ పర్యటన వాయిదా

Updated on: Mar 21, 2020 | 6:29 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఆ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగు, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా ఉండాలని, కరీంనగర్ జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు.. సీఎం కేసీఆర్‌ తలపెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి సహా కరీంనగర్ లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పలు మార్లు ముఖ్యమంత్రి ఆరాతీశారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు సీఎం స్వయంగా కరీనంగర్ పట్టణంలో పర్యటించాలని తొలుత భావించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరీంనగర్ లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో అధికార యంత్రాంగం సీఎంకు భరోసానిచ్చారు. తాజా పరిస్థితుల్లో పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.