తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్వతాహాగా రైతు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన రైతులపై కాస్త ఎక్కువ ప్రేమ ప్రదర్శిస్తారు. నూతన వ్యవసాయ విధానాలపై ఆసక్తి ప్రదర్శిస్తారు. ఎక్కడైన రైతులు వినూత్న విధానాలతో అధిక దిగుబడులు రాబడుతుంటే.. వారికి స్వయంగా ఫోన్ చేసి ముచ్చటిస్తారు. రైతు కన్నీరు పెట్టుకుంటూ తన సమస్యను సోషల్ మీడియాలో చెప్పుకుంటే.. వెంటనే స్పందించి ఫోన్ చేసిన ఘటన కూడా మనం చూశాం. కాగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులకు మద్దతుగా నిలిచి..తాను ఉన్నాననే భరోసా ఇచ్చారు. తాజాగా నేలపై భారీగా గీసిన కేసీఆర్ చిత్రం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. ట్రాక్టర్ల సాయంతో ఈ చిత్రాన్ని గీశారు. రైతుల వెన్నంటే సీఎం కేసీఆర్ ఉన్నారని సందేశం ఆవిష్కృతమయ్యే విధంగా ముఖ్యమంత్రి పక్కనే నాగలి పట్టుకున్న రైతు చిత్రాన్ని కూడా గీశారు. తెలంగాణలో రైతును రాజుగా మార్చిన సీఎం కేసీఆర్‌పై రైతులు తమ అభిమానాన్ని ఏదో ఒక రకంగా చాటుకుంటూనే ఉన్నారు.
తాజా చిత్రాన్ని హాలియా మున్సిపాలిటీ పరిధిలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నేలపై గీశారు. ఆ పక్కనే భుజంపై నాగలితో ఉన్న రైతు చిత్రాన్ని గీశారు. అయితే ఈ చిత్రాల ఆకృతిని చూడచక్కగా తెచ్చేందుకు రెండు రోజులు పట్టింది. చిత్రాలు గీసిన తర్వాత డ్రోన్ కెమెరాతో వాటిని షూట్ చేసి టీఆర్‌ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ పాటిమీది జగన్మోహన్‌రావు సోమవారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. చిత్రాల కింద టీఆర్‌ఎస్ వెంటే నాగార్జునసాగర్ అని ఆంగ్ల భాషలో రాశారు.
100,000sft, Land Mural Gratitude to #CMKCR who stood behind farmer adding growth to his farming & honour to his living.
A wonderful hard work of young farmers of Haliya in collaboration with #TRS SM Team.#NagarjunaSagarWithTRS@KTRTRS @PRRTRS @korkantichander @BagathNomula pic.twitter.com/B7X32RjShY— Jagan Patimeedi (@JAGANTRS) April 5, 2021
Also Read: భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా.. మరోసారి 90 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు.!