కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ప్రధాని మోదీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీలో 7 మండలాలు కలిపినప్పుడే చెప్పానన్నారు.. ప్రధాని మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే తెలంగాణ మండలాలను లాక్కోవడమే కాకుండా.. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను లాక్కుందని ఆరోపించారు. వ్యక్తిగత విద్యుత్తు వినియోగం ఎంత అనేది అభివృద్ధిలో భాగంగా చూస్తారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డామన్న సీఎం.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో చాలామంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు.
ఏపీలోని శ్రీకాకుళంలో మీటర్ల పెడితే రైతులు ఆందోళన చేశారని తెలిపారు. యూపీ సహా అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్నారు.
ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్రాలకు ఏమాత్రం చెప్పకుండా.. కనీసం చర్చ జరగకుండా విద్యుత్ బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు సీఎం కేసీఆర్.
అభివృద్ధిని అనేక కొలమానాల ప్రకారం చూస్తారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వ్యక్తిగత విద్యుత్తు వినియోగం ఎంత అనేది అభివృద్ధిలో భాగంగా చూస్తారని అన్నారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం