Hyderabad: వారందరినీ దత్తత తీసుకుంటా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన..

|

May 29, 2022 | 6:01 PM

Hyderabad: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల అండగా తాను..

Hyderabad: వారందరినీ దత్తత తీసుకుంటా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన..
Union Minister G Kishan Reddy(File Photo)
Follow us on

Hyderabad: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల అండగా తాను ఉంటానని ప్రకటించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను సోమవారం నాడు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద దత్తత తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి ఎన్‌పీఆర్ కన్వెన్షన్‌లో బీజేపీ నేతలతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా 8 ఏళ్లు పూర్తయిన క్రమంలో దేశానికి చేసిన సేవ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. మోడీ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు చేరువయ్యాయని, వీటిపై 15 రోజులపాటు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని అన్నారు.

కరోనా కారణంగా నిరాశ్రయులైన వారిని దత్తత తీసుకోవడం, కిసాన్ సమ్మాన్ నిధి కింద 11వ విడత రూ. 20 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పాతబస్తీలో ఉన్న హిందువుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం మూలంగా హిందువులంతా ఆ ప్రాంతం నుండి తరలి వెళ్తున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మత కల్లోలాలను రెచ్చగొట్టి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ అసదుద్దీన్ ఓవైసీ నిప్పు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా బలగాలను పక్కన పెడితే హిందువులను ఊచకోత కోస్తామని వ్యాఖ్యలు చేయడం అసదుద్దిన్ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.