Hyderabad: కాచిగూడలో విషాదం.. భవనంపై నుంచి పడి చిన్నారి మృతి

ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి పసికందు మృతి చెందిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిటీలోని నింబోలిగడ్డలోని ఓ భవనం రెండో అంతస్తులో వి.ప్రియాన్షి అనే ఏడాదిన్నర బాలిక నివసిస్తోంది. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా సాయంత్రం ఆడుకుంటూ  బయటకు వచ్చింది.

Hyderabad: కాచిగూడలో విషాదం.. భవనంపై నుంచి పడి చిన్నారి మృతి
Death

Updated on: Apr 07, 2024 | 10:06 PM

ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి పసికందు మృతి చెందిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిటీలోని నింబోలిగడ్డలోని ఓ భవనం రెండో అంతస్తులో వి.ప్రియాన్షి అనే ఏడాదిన్నర బాలిక నివసిస్తోంది. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా సాయంత్రం ఆడుకుంటూ  బయటకు వచ్చింది. అయితే ఆ అమ్మాయి కుర్చీ ఎక్కింది. గోడపై నుంచి జారి పక్కనే ఉన్న భవనంపై పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి.

వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాచిగూడ ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు మస్ట్

ఇళ్లలో ఉపయోగించని అన్ని ఎలక్ట్రికల్ ప్లగ్ మూసి వేయాలి
మెట్లకు అడ్డంగా ఒక చిన్న గేటు లేదా కంచెను ఏర్పాటు చేయాలి
గ్యారేజీ, బాత్రూమ్ లేదా బాల్కనీ వంటి ప్రమాదకర ప్లేసుల తలుపులను లాక్ చేయాలి
ఇక ఇంట్లో ఐరన్ బాక్స్, హీటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి
పిల్లల రక్షణ కోసం కోసం కిచెన్ లో కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి