Casino Case: తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోన్న చీకోటి లింకులు.. ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్న రాజకీయ నేతలు..

|

Nov 17, 2022 | 9:32 PM

క్యాసినో వ్యవహారంలో పొలిటికల్ లింకులే ఎక్కువగా బయటపడుతున్నాయి. కోటి ప్రవీణ్ లిస్ట్‌లో తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కీలక నేతలు బయటకు వస్తున్నారు. లింకులు ఉన్న వాళ్లకు ఈడీ నోటీసులు..

Casino Case: తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోన్న చీకోటి లింకులు.. ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్న రాజకీయ నేతలు..
Ed
Follow us on

చీకోటి ప్రవీణ్ కేసులో ఈడీ స్పీడ్‌ పెంచింది. క్యాసినో వ్యవహారంలో పొలిటికల్ లింకులే ఎక్కువగా బయటపడుతున్నాయి. కోటి ప్రవీణ్ లిస్ట్‌లో తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కీలక నేతలు బయటకు వస్తున్నారు. లింకులు ఉన్న వాళ్లకు ఈడీ నోటీసులు ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తుండటంతో.. ఆయా నేతల్లో వణుకు మొదలైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్‌ని కూడా ఈడీ విచారించింది. ఈ యుగంధర్ రెడ్డికి పంజాగుట్టలో ఊర్వశి బార్ కూడా ఉంది. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించారనేది వీళ్లపై ఉన్న ఆరోపణ. చీకోటి కేసినోల్లో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లారని.. హవాలా ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆదేశించినట్టు సమాచారం.

ఇప్పటికే మంత్రి తలసాని సోదరులు మహేష్‌, ధర్మేంద్రలను బుధవారం 10 గంటల పాటు అధికారులు విచారించారు. క్యాసినోతో పాటు ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డిలను కూడా శుక్రవారం విచారించబోతున్నారు అధికారులు.

చీకోటి ప్రవీణ్, మాధవ్‎రెడ్డి కాల్‎డేటా ఆధారంగా ఈ కేసు ఎంక్వైరీ జరుగుతోంది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్ వివరాలు సేకరించిన ఈడీ.. అనుమానితులను విచారణకు పిలుస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటి వరకు వంద మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నేపాల్ వెళ్లిన కేసీను పాడిన అందరికీ నోటీసులు ఇస్తోంది ఈడీ. రాజకీయ నేతలు, వారితో సంబంధాలున్నవారే ఈ కేసుల్లో ఉన్నారు.

నోటీసులు అందిన వారికి సంబంధించి.. 4 సంవత్సరాల ఆర్ధిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నోటీసులు అందుకున్న వారి పేర్లు బయటకు వచ్చే కొద్దీ సంచలనంగా మారుతోంది. ముందు ముందు మరికొంత మంది విచారణ ఎదుర్కోక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం