Telangana: ఆదివారం ముక్క లేకపోతే ముద్ద దిగదా.? ఈ విషయం తెలిస్తే దెబ్బకు షాక్ అవుతారు..

ఆదివారం వస్తే చాలు ముక్క లేకపోతే ముద్ద దిగదు. అయితే ఇటీవల కోడి ధరలు కొండెక్కాయి. వారం.. వారం కోడి ధరలు పెరుగుతూపోతున్నాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Telangana: ఆదివారం ముక్క లేకపోతే ముద్ద దిగదా.? ఈ విషయం తెలిస్తే దెబ్బకు షాక్ అవుతారు..
Chicken Cost

Edited By:

Updated on: Dec 28, 2025 | 1:08 PM

పండుగైనా, పబ్బమైనా ఇంటికి చుట్టాలు వచ్చినా.. మనమే చుట్టాలుగా వేరేవాళ్ల ఇంటికి వెళ్లినా.. ఆదివారం వచ్చిందంటే మొదటగా వడ్డించేది కోడి కూర.. అలాంటి కోడి కూర ఇప్పుడు కొండెక్కి కిందకు దిగిరానంటోంది. రోజురోజుకీ ధర పెరుగుతూ అందనంత పైపైకి వెళ్తూ ఉంది. ఆదివారం వచ్చిందంటే చిన్న, పెద్ద అందరూ భోజనంలోకి ఎదురుచూసేది చికెన్. ఆదివారం అయ్యిందంటే చికెన్ షాప్‌లో ముందు పెద్ద క్యూలైన్ కనిపించేది. కానీ ప్రస్తుతం సీన్ మారిపోయింది. కిలో చికెన్ కొనే డబ్బులతో వారం పాటు కూరగాయలు కొనుక్కోవచ్చు అనే స్థితిలో మధ్యతరగతి మనుషులు మారిపోయారు. కేవలం వారం రోజుల వ్యవధిలో రూ. 50 నుంచి రూ. 80 వరకు చికెన్ ధరలు పెరిగిపోయాయి. గతవారం రూ. 250 ఉన్న కేజీ చికెన్, ప్రస్తుతం రూ. 300 నుంచి రూ. 320 అయ్యింది. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కిలోపై రూ.50 పెరిగింది. దీంతో సామాన్యులు సతమతం అవుతున్నారు.

కార్తీక మాసం ముగిసినప్పటి నుంచి ధరలు పెరగడం ప్రారంభం అయింది. వారం వారం రూ.10 నుంచి రూ.20 వరకు పెంచుతున్నారు. గత వారం క్రితం లైవ్ రూ.130, డ్రెస్డ్‌డ్ చికెన్ రూ.200 నుంచి రూ.240 పలకగా, ప్రస్తుతం లైవ్ రూ.160, డ్రెస్డ్‌డ్ రూ.270, స్కిన్లెస్ రూ. 300 పలుకుతోంది. కిలోపై రూ. 50 మేర పెరిగింది. అయితే దీనికి కారణం కోళ్ల రేటు పెరగటమేనని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోళ్లు జిల్లాలోనే అందుబాటులో ఉండేవని, దీంతో ధరలు తక్కువగా ఉండేవంటున్నారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందంటున్నారు. రవాణా చార్జీలు తడిసి మోపడవుతుండటంతో చికెన్ రేటు పెరిగిందని చెబుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వారు చెప్పిన ధరకి కోళ్ళని కొనుగోలు చేసి వాటిని తమ ప్రాంతం వరకు రవాణా చేసుకోవడంతో తమకు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, అందుకు తగ్గట్టుగానే తాము చికెన్ రేట్లు పెంచుతున్నామని.. పైగా పండుగ సమయాలు కూడా ధరలు పెంచకపోతే తాము నష్టపోతామని అంటున్నారు వ్యాపారులు.

మరో వైపు చికెన్ ధరలు పెంచితే ఎవరూ ఎక్కువగా చికెన్ కొనడం లేదని చికెన్ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి ఇలా వారికి ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచుకుంటూ పోతే మాలాంటి చికెన్ ప్రియులు ఎలా తినాలి అని.? ఈ చికెన్‌కు పెట్టే డబ్బులతో వారం పాటు ఇంట్లోకి సరిపోయే కూరగాయలు వస్తాయని కొనుగోలుదారులు అంటున్నారు. కనీసం వారానికి ఒక్కసారైనా చికెన్ తిందామనుకుంటే పెంచిన రేట్లతో చికెన్ ప్రియులు షాక్‌కి గురి అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..