Ananthagiri: అమ్మో చిరుతొచ్చింది.. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో చిరుత పులుల సంచారం..!

|

Nov 08, 2023 | 9:45 AM

అటు అనంత పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రం.. ఇటు ఆనందం, ఆహ్లాదం పంచుతూ రా రమ్మనే టూరిస్ట్‌ స్పాట్‌. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరికి వెళ్లాలంటే ఓ కొత్త భయం పట్టుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో చిరుత పులుల సంచారంతో స్థానికులు, పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు.

Ananthagiri: అమ్మో చిరుతొచ్చింది.. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో చిరుత పులుల సంచారం..!
leopard
Follow us on

హైదరాబాద్, నవంబర్ 08: అటు అనంత పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రం.. ఇటు ఆనందం, ఆహ్లాదం పంచుతూ రా రమ్మనే టూరిస్ట్‌ స్పాట్‌. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరికి వెళ్లాలంటే ఓ కొత్త భయం పట్టుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో చిరుత పులుల సంచారంతో స్థానికులు, పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం పూడూరు మండలం దామగుండం అడవుల్లో, నేడు అనంతగిరి అడవిలో చిరుత సంచారం కలకల రేపింది. దామగుండం అడవుల్లో సీసీ కెమెరాకు చిరుత చిక్కింది. అనంతగిరిలో రోడ్డు దాటుతుండగా స్థానికులు చిరుతను చూసి ఆందోళనకు గురయ్యారు. అనంతగిరి పుణ్యక్షేత్రమే కాకుండా, టూరిస్టు స్పాట్‌ కూడా కావడంతో నిత్యం హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడకు ప్రజలు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో చిరుతల సంచారం కలవరం కలిగిస్తోంది.

వికారాబాద్ అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. అడవికి దగ్గర్లోని గ్రామస్తులు రాత్రి సమయంలో, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు.

అనంతగిరి అడవిలోకి చిరుత రావడం మంచి పరిణామం అంటున్నారు జంతు ప్రేమికులు. అయితే అడవి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

చిరుత సంచారంతో అనంతగిరి పరిసర ప్రజలే కాకుండా హైదరాబాద్‌ నుంచి వెళ్లే టూరిస్టులు కూడా అప్రమత్తంగా ఉండాలంని అధికారులు అధికారులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు లేకుండా అడవిలోకి వెళ్లొద్దంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..