Telangana:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత రెండు రోజులుగా వరుసగా తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తోన్న ఆమె తాజాగా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘కేంద్రం వాటా ఉన్న ప్రతి పథకానికి కేంద్రం పేరు పెట్టాల్సిందే. రాష్ట్రం వాటా ఇచ్చిన వెంటనే కేంద్రం వాటాలు విడుదల చేస్తున్నాం. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేను ఏం చెప్పానో మంత్రి హరీశ్ స్పష్టంగా విని మాట్లాడి ఉంటే బాగుండేది. ఉండాల్సింది. నేను అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం చెప్పలేదు. అందుకే సమాచారం తెలుసుకుని మాట్లాడమన్నాను. వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడితే ఎలా సమాధానమివ్వాలో నాకు తెలుసు. అప్పులు తీసుకొచ్చి చేసే పనులు ఆలస్యమైతే కేంద్రానికి సంబంధం లేదు. 2021 వరకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదు’ అని నిర్మల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల775299,775281,775243,775263 కోసం క్లిక్ చేయండి..