MLC Kavitha: కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చా..: ఎమ్మెల్సీ కవిత

|

Mar 03, 2023 | 8:59 PM

బీఆర్‌ఎస్‌లో మహిళలకు ఇంకా న్యాయం జరగాలని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీవీ9 నిర్వహించిన ఎక్స్‌క్లూజివ్‌..

MLC Kavitha: కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చా..: ఎమ్మెల్సీ కవిత
MLC K Kavitha
Follow us on

బీఆర్‌ఎస్‌లో మహిళలకు ఇంకా న్యాయం జరగాలని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీవీ9 నిర్వహించిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. చట్టం చేస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీలో ఉండే అందరిలో ఒకరిగానే కేసీఆర్‌ మద్దతు ఉంటుందని అన్నారు. మీ రాజకీయ లక్ష్యమేంటని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. తాను కేసీఆర్‌ ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, నాన్న కేసీఆర్‌ చెప్పిన విధానం ప్రకారమే పార్టీలో నడుచుకుంటానని, ప్రజల సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కేసీఆర్‌ చెప్పిన మాటలను గుర్తించుకుని ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు.

నాకంటే ఓ లక్ష్యం అంటూ లేదని, కేసీఆర్‌ ఎలా చెబితే అలా చేస్తున్నానని, నాకంటే ఓ గోల్‌ అంటే పార్టీలో కష్టపడి పని చేయాలన్నది లక్ష్యమన్నారు. ఎన్ని పదవులు చేపట్టినా.. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యమన్నారు. కేసీఆర్‌ ఏ విషయం చెప్పినా ప్రజల కోసమే చెబుతారని, అలాంటి సమయంలో తాను సొంతగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని, కేసీఆర్‌ చెప్పినట్లుగానే ముందుకు సాగుతానని అన్నారు. అలాగే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నానని, నన్ను చూసి రాష్ట్రంలోని మరి కొంత మంది ఆడ బిడ్డులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని, మంచి పేరు తెచ్చుకునేలా పార్టీలో పని చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంలో మీ కల్వకుంట్ల కుటుంబం దాదాపు 30 శాతం కమిషన్లతో సుమారు 80 వేల కోట్ల రూపాయల వరకు సంపాదించారని నిజామాబాద్‌ ఎంపీ అరవీంద్‌ చేసిన ఆరోపణలపై ఏమంటారని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొత్తం మీద ఖర్చు పెట్టింది దాదాపు 80-90 కోట్ల వరకు ఉండవచ్చని, ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉందని, ఖర్చు పెట్టిన మొత్తాన్నే కాజేసినట్లు ఆరోపిస్తే ప్రజలకు నీళ్లు ఎలా వస్తున్నాయని, ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని కవిత వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఏ స్థాయికి తీసుకెళ్లగలుగుతున్నారనే దానిపై ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ దేశంలో ఒక కీలక రాజకీయ శక్తిగా తీసుకెళ్లగలుగుతామనే నమ్మకం ఉంది. అన్ని రాష్ట్రాలు తిరుగుతామని, అందరితో చర్చలు జరుపుతామన్నారు. బీఆర్‌ఎస్‌ మంచి జాతీయ పాత్ర పోషిస్తుందని, భారతదేశం కోసం పని చేస్తుందని ఆమె అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి