Telangana: ‘హరీశ్ పెత్తనం ఏంది’.. తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే వార్ తప్పదన్న మైనంపల్లి

|

Aug 21, 2023 | 12:58 PM

మధ్యాహ్నం అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 105 మందితో BRS తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి మళ్లీ  అవకాశం దక్కనుంది. 8 నుంచి 10 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. టికెట్‌ దక్కించుకునేందుకు కొందరు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా 2018లోనూ ఒకేసారి 105 మంది అభ్యర్థులను  కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Telangana: హరీశ్ పెత్తనం ఏంది.. తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే వార్ తప్పదన్న మైనంపల్లి
Mynampally Hanumantha Rao
Follow us on

టికెట్ల ప్రకటనకు ముందే బీఆర్‌ఎస్ నేతల నుంచి అసమ్మతి రాగాలు వీస్తున్నాయి. తమకు టికెట్లు ఇవ్వకుంటే.. పార్టీకి డ్యామేజ్ తప్పదని కొందరు బాహటంగానే చెప్తున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి వాయిస్ పెంచారు. తన కుమారుడికి, తనకు మెదక్, మల్కాజ్‌గిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తామని మైనంపల్లి ప్రకటించారు. తన కుమారుడిని మెదక్ ఎమ్మెల్యే చేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని.. తనకు టికెట్‌ కూడా డిక్లేర్‌ చేశారని.. అయితే తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెట్లు పోటీ చేస్తామని ఆయన తెలిపారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని.. దాదాపు రూ.8 కోట్లు సొంత డబ్బు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మెదక్‌లో హరీశ్‌రావు నియంతలా వ్యవహరిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు మైనంపల్లి. హరీశ్‌రావు తన గతం గుర్తుంచుకోవాలని.. సిద్దిపేట వలే మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. వచ్చేసారి సిద్దిపేటలో పోటీ చేసి హరీశ్‌రావు అడ్రస్‌ గల్లంతు చేస్తానని ఆయన స్ట్రైయిట్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం..  మైనంపల్లి ఈ కామెంట్స్ చేశారు.

అటు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సైతం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి.. పదవుల కోసం కాదు అని తన తండ్రి  మాటలను ప్రతిసారి స్మరించుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఆ పనిని తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తానని తనతో ఉన్నవారందరికీ భరోసా ఇస్తున్నాను ఆయన రాసుకొచ్చారు. నిర్ణయాలు అందరితో సంప్రదించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి.. లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయని ఆయన ఓ చిరు హెచ్చరిక పంపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొందరికి టికెట్ ఇవ్వొద్దంటూ నియోజక వర్గాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో నేతలకు అసమ్మతి సెగ కనిపిస్తుంది.  జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, మెదక్, నర్సాపూర్, భద్రాచలం, ఇల్లందు నియోజక వర్గాల్లో నిరసనల పర్వం కొనసాగుతుంది. సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వొదని 6 చోట్ల క్యాడర్ ఆందోళన చేస్తున్నారు.

మధ్యాహ్నం అభ్యర్థుల తొలి జాబితా

మధ్యాహ్నం అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 105 మందితో BRS తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి మళ్లీ  అవకాశం దక్కనుంది. 8 నుంచి 10 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. టికెట్‌ దక్కించుకునేందుకు కొందరు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా 2018లోనూ ఒకేసారి 105 మంది అభ్యర్థులను  కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..