Bandi Sanjay: ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలి.. నిర్మల్ వేదికగా పిలుపునిచ్చిన బండి సంజయ్

ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు.

Bandi Sanjay: ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలి.. నిర్మల్ వేదికగా పిలుపునిచ్చిన బండి సంజయ్
Bandi Sanjay

Updated on: Sep 17, 2021 | 4:23 PM

BJP Chief Bandi Sanjay: ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామన్నారు. సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు. తెలంగాణలో విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ప్రసంగించారు. హోంమత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై నిర్మల్‌ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులకు బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని.. ప్రగతి భవన్‌కు బీజేపీ జయధ్వానాలు వినిపించాలన్నారు. తెలంగాణ విమోచన వీరుల చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Read Also…  AP ZPTC MPTC Counting: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల లెక్కింపునకు సర్వం సిద్ధం.. కౌంటింగ్‌పై ఎస్ఈసీ, సీఎస్ సమీక్ష