JP Nadda Public Meeting Highlights: ‘జేబులు నింపుకోవడానికే ధరణి’.. బీఆర్ఎప్ ప్రభుత్వంపై జేపీ నడ్డా ఫైర్..

|

Jun 25, 2023 | 7:01 PM

JP Nadda Public Meet in Nagarkurnool Highlights: నేతలంతా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. పార్టీ లైన్‌ దాటి ఎవరూ మాట్లాడొద్దని సూచించినట్టు తెలుస్తోంది. తెలంగాణ పర్యటనలో భాగంగా..

JP Nadda Public Meeting Highlights: ‘జేబులు నింపుకోవడానికే ధరణి’.. బీఆర్ఎప్ ప్రభుత్వంపై జేపీ నడ్డా ఫైర్..
JP Nadda Public Meet in Nagarkurnool

JP Nadda Public Meet in Nagarkurnool Highlights: తెలంగాణలో కమలం వికసిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ధరణితో జేబులు నింపుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తుందని, బీఆర్ఎస్ అంటే ‘భ్రష్టాచార్ రాక్షసుల సమితి’ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన నవ సంకల్స సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మోదీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని, ప్రతిపక్షాలన్నీ కుటుంబ అభివృద్ధి కోసమే ఉన్నాయని పేర్కొన్నారు. జేపీ నడ్డా తన ప్రసంగం ప్రారంభంలో స్థానికంగా శక్తిపీఠం రూపంలో కొలువై ఉన్న జోగులాంబ తల్లికి, పవిత్ర కృష్ణమ్మకు నమస్కరించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంకా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన ఉద్యమకారులను నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. తెలంగాణ సామర్థ్యాన్ని కేసీఆర్ నాశనం చేశారని, కానీ ఈ రాష్ట్ర వికాసం కోసం మోదీ ఎంతో కృషి చేశారన్నారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని.. తెలంగాణలో అన్ని వర్గాలవారు దుఃఖంలో ఉన్నారని.. కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే సంతోషంగా ఉన్నారని విమర్శించారు.

అలాగే మోదీ ప్రభుత్వమే దేశంలోని 80 కోట్ల మందికి రేషన్ బియ్యం అందిస్తోందని, మొత్తం ఐరోపా ఖండంలో కంటే 5 రెట్లు ఎక్కువ మందికి రేషన్ అందుతోందని, ఉజ్వల, ఉజాలా పథకాలతో గ్యాస్ అందిస్తున్నామని, ఆయుష్మాన్‌లో ఎందరికో బీమా కల్పించామని పేర్కన్నారు. ప్రపంచ దేశాలు అర్థిక, రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడిన సమయంలో కూడా భారత్ దూసుకెళ్లిందని, మనం నిశ్చింతగా ఉన్నామని అందుకు నరేంద్ర మోదీ పాలనే కారణమని గుర్తించాలన్నారు. ‘‘18 లక్షల కోట్ల రూపాయలతో భారత్‌లో రోడ్లు నిర్మించాం. ఈ ఏడాది 10 లక్షల కోట్లతో నేషనల్‌ హైవేలు వేస్తున్నాం. 2300 కి.మీ. రోడ్లు తెలంగాణ గ్రామాల్లో వేశాం. ‘మోదీ ది బాస్‌’ అని దేశాధినేతలే కొనియాడుతున్నారు. అందరూ మోదీని హీరో, గ్లోబల్‌ లీడర్‌ అంటుంటే.. కాంగ్రెస్‌ నేతల కడుపు మండుతోంది. ఈజిప్టు అత్యున్నత పురస్కారం మోదీకి ఇచ్చారంటే.. ఆయన దేశానికి, ప్రపంచానికి ఎంత చేశారో అర్ధం చేసుకోవాలి. తెలంగాణలో రూ. 11300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణ చేసి.. రైల్వే లైన్‌ డబ్లింగ్‌, వందేభారత్‌ రైళ్లు మోదీ తెలంగాణకు ఇచ్చారు’’ అని నడ్డా తెలిపారు.

ఇంకా ‘‘నిన్న పాట్నాలో విపక్షాల ర్యాలీ జరిగింది. పాట్నాలో జరిగింది కేవలం ఫొటో సెషనే. మరోవైపు ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేసి, కుటుంబపార్టీలను సమాధి చేస్తున్నారు. నిన్న కలిసిన వారంతా కుటుంబ పార్టీలే. ఆర్జేడీ, ఎస్పీ, టీఎంసీ, ఉద్ధవ్‌ పార్టీలన్నీ.. తమ కుటుంబాన్ని కాపాడుకునేందుకే కలిశారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో ప్రతి రైతుకు ఏటా రూ.6వేలు అందిస్తున్నాం. కానీ ధరణి పోర్టల్‌తో బీఆర్ఎస్ పార్టీ తన నాయకుల జేబులు నింపుకోవాలని చూస్తోంది. బీజేపీ వస్తుంది.. దరణి పోర్టల్‌ని రద్దు చేస్తుందని’’ అని నడ్డా తెలంగాణ ప్రజలకు హమీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Jun 2023 06:27 PM (IST)

    జేబులు నింపుకోవడానికే ధరణి పొర్టల్..

    టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన ఈ పార్టీ అసలు పేరు ‘భ్రష్టాచార్ రాక్షసుల సమితి’ అని, రైతులను పీడించి తమ జేబులను నింపుకోవడానికే ధరణి పోర్టల్ ఉందని, బీజేపీ ప్రభుత్వం వస్తే ధరణిని రద్దు చేస్తామని జేపీ నడ్డా పేర్కొన్నారు.

  • 25 Jun 2023 06:23 PM (IST)

    అవన్నీ కుటుంబ పార్టీలు..

    ప్రతిపక్షంలోని పార్టీలను చూస్తే అవన్నీ కుటుంబ పార్టీలని, వాటిని తమ కుటుంబ అభివృద్ధి మాత్రమే కావాలని ఎద్దేవా చేశారు జేపీ నడ్డా. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే మోదీకే ఓటు వేయాలని కోరారు

  • 25 Jun 2023 06:21 PM (IST)

    మోదీ పాలనలోనే ఈ అభివృద్ధి..

    కాంగ్రెస్ హయాంలో జరగని అభివృద్ధి మోదీ పాలనలోనే జరిగిందని జేపీ నడ్డా తెలిపారు. వందేభారత్ సహా ఎన్నో రకాల రవాణా సౌకర్యాలు.. వేల కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం బీజేపీ చేపట్టిందన్నారు. 50 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసిందో.. బీజేపీ ఏం చేసి చూపిందో మీరే చూడాలని ప్రజలను కోరారు..

  • 25 Jun 2023 06:13 PM (IST)

    మోదీ కారణంగానే నిశ్చింతగా ఉండగలుగుతున్నాం..

    ప్రపంచ దేశాలు యుద్ధం, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వేళ కూడా ప్రధాని మోదీ చూపుతోనే మనం నిశ్చింతగా ఉండగలుగుతున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రపంచ నాయకులు ‘మోదీ మా లీడర్’ అని చెప్పుకుంటుంటే.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆయన్ను ‘చాయ్ వాలా, చదువు లేనోడు’ అంటూ విమర్శిస్తున్నారని అన్నారు.

  • 25 Jun 2023 06:10 PM (IST)

    మోదీ నినాదాలతో హోరెత్తిన నాగర్‌కర్నూల్..

    నాగర్‌కర్నూల్ వేదికగా జరుగుతున్న నవ సంకల్ప సభ ‘మోదీ మోదీ’ నినాదాలు హోరెత్తాయి. జేపీ నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో ఈ నినాదాలు చోటుచేసుకున్నాయి.

  • 25 Jun 2023 06:01 PM (IST)

    కమలం వికసిస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యం..

    తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు దోపిడికి అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ పార్టీ రావాలని, కమలం వికసిస్తేనే అది సాధ్యమని ప్రజలకు బీజేపీ నడ్డా పిలుపునిచ్చారు. మోదీ పాలనలోనే పేదరిక నిర్మూలన సాధ్యమని, కమలం పాలనలోనే పేదరికం 20 నుంచి 10 శాతానికి పడిపోయిందని, పేదవాని కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించారని, ఆయుష్మాన్ పథకంతో ఎంతో మందికి బీమా కల్పించమని అన్నారు.

  • 25 Jun 2023 05:55 PM (IST)

    బీఆర్ఎస్ పార్టీ అందుకే..

    కేసీఆర్ కుటుంబ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్‌గా మారిందని జేపీ నడ్డా అన్నారు. మోదీ నాయకత్వంలో మాత్రమే బడుగు బలహీన వర్గాలవారికి సహకారం అందుతుందన్నారు. తెలంగాణకు మోదీ పెద్ద మోత్తంలో నిధులు ఇచ్చారని, రాష్ట్ర వికాసం కోసం కృషి చేశారని పేర్కొన్నారు.

  • 25 Jun 2023 05:51 PM (IST)

    ఉద్యమకారులకు నివాళులు.. కేసీఆర్ కుంటుబానికి విమర్శలు..

    నవ సంకల్ప సభలో ప్రసంగిస్తున్న జేపీ నడ్డా.. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఎందరో ఉద్యమకారులకు నివాళులు తెలిపారు. వారంతా కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఒక కుటుంబం దేశాన్ని పట్టిపీడిస్తోందని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.

  • 25 Jun 2023 05:48 PM (IST)

    అందరికీ జేపీ నడ్డా సుస్వాగతం..

    నాగర్‌కర్నూల్ వేదికగా జరుగుతున్న నవ సంకల్ప సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా స్వాగతం పలికారు. ఇంకా స్థానికి శక్తిపీఠంలో కొలువై ఉన్న జోగులాంబకు సాదర నమస్కారం చేశారు.

  • 25 Jun 2023 05:42 PM (IST)

    బీజేపీ అగ్రనేతకు ఘన స్వాగతం..

    నాగర్‌కర్నూల్‌ వేదికగా జరుగుతున్న నవ సంకల్ప సభ ప్రాంగణానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జీపీ నడ్డా చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ‘భారత్ మాతా కీ జై’ అని నినాదిస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంకా డీకే ఆరుణ సహా పలువురు జిల్లా అధ్యక్షులు ఆయనను సత్కరించారు.

  • 25 Jun 2023 05:37 PM (IST)

    బీఆర్ఎస్‌ పాలనపై డీకే ఆరుణ ఫైర్..

    తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పాలనపై బీజేపీ నాయకురాలు డీకే ఆరుణ ఫైర్ అయ్యారు. తమకు ఓటు వేయకపోతే రైతు బంధు, పెన్షన్ ఇవ్వమని బెదిరిస్తున్నారని.. కానీ సీఎం కేసీఆర్ అన్ని రకాల సదుపాయాలను నలిపివేస్తున్నారని అన్నారు.  ఇంకా ఒక ఎకరాకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 20 సబ్సీడీ ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

  • 25 Jun 2023 05:13 PM (IST)

    వాళ్లు కలిసి పనిచేసినా.. విజయం మాదే..

    హైదరాబాద్ చేరుకున్న బీజేపీ జాతీయాధక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణలోని పార్టీ నాయకులతో నోవాటెల్ హోటల్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పనిచేస్తున్నాయని.. ఇంతక ముందు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంద’ని ధీమా వ్యక్తం చేశారు.

  • 25 Jun 2023 04:22 PM (IST)

    రాజీ ప్రసక్తే లేదు.. ఆ పార్టీతో సీరియస్‌ ఫైట్‌ మాత్రమే..

    హైదరాబాద్ చేరుకున్న తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులతో జేపీ నడ్డా సమావేశమైన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల కోసం సన్నద్ధమై ఉండాలని వారికి దిశానిర్దేశం చేస్తూనే పార్టీ లైన్ దాటవద్దని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యంగా పనిచేయాలని, బీఆర్ఎస్‌తో రాజీలేదని, ఆ పార్టీతో సీరియస్‌ ఫైట్‌ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

  • 25 Jun 2023 04:14 PM (IST)

    ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌తో నడ్డా భేటీ..

    నాగర్‌కర్నూల్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొనే ముందుగా జేపీ నడ్డా స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఈ మేరకు జేపీ నడ్డా స్వయంగా టోలిచౌక్‌లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్దిపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు జేపీ నడ్డా అందజేసి, కాసేపు ముచ్చటించారు.

  • 25 Jun 2023 04:09 PM (IST)

    స్థానిక నేతలతో సమావేశం..

    తెలంగాణ పర్యటన నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బీజేపీ చీఫ్ నడ్డాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, రఘునందన్‌, విజయశాంతి, వివేక్‌ వంటి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

     

  • 25 Jun 2023 04:03 PM (IST)

    ‘నవ సంకల్ప సభ’ లక్ష్యమిదే..

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు, విజయాలను తెలంగాణ ప్రజల ఎదుట ఎత్తిచూపేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ‘నవ సంకల్ప సభ’ అనే పేరుతో జరిగే ఈ మీటింగ్‌లో రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించనున్నారు.

     

Follow us on