Raja Singh: తెలంగాణలోనూ మహారాష్ట్ర పొలిటికల్‌ ఫార్ములా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

|

Jul 21, 2022 | 4:48 PM

మహారాష్ట్రలో శివసేన కూటమి సర్కార్‌కు ఎలాంటి గతి పట్టిందో.. తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి కూడా అదే గతి రాజాసింగ్‌ పడుతుందని రాజాసింగ్ పేర్కొన్నారు.

Raja Singh: తెలంగాణలోనూ మహారాష్ట్ర పొలిటికల్‌ ఫార్ములా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
Rajasingh
Follow us on

BJP MLA Raja Singh on TRS: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి మహారాష్ట్ర ఫార్ములా ట్రెండింగ్‌లోకి వచ్చింది. బీజేపీ చేపట్టిన ప్రజాగోస యాత్ర సందర్బంగా.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన కూటమి సర్కార్‌కు ఎలాంటి గతి పట్టిందో.. తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి కూడా అదే గతి రాజాసింగ్‌ పడుతుందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుందంటూ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు చాలెంజ్‌ విసిరారు. మహారాష్ట్రలో శివసేన రెబెల్ ఎంపీ ఏక్నాథ్ షిండే.. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ అండతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సంగతి తెలిసిందే. ఇలాంటిదే తెలంగాణలో కూడా జరగబోతోందంటూ రాజాసింగ్ జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉందని.. తమ పదవులు ఉంటాయనే నమ్మకం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా వారు పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందని.. ప్రధాని మోడీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొన్నారు.

దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలోనూ జరుగుతుందా? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి? ఆయన చెప్పినట్టు.. టీఆర్ఎస్‌లోనూ ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారా? అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి