Telangana BJP: 27న భద్రకాళి టెంపుల్ వద్ద ముగియనున్న బీజేపీ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర..
Telangana BJP: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర సారధి బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది.

Telangana BJP: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర సారధి బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. మీదికొండ క్రాస్ నుంచి ప్రారంభమై శివారెడ్డిపల్లి, చాగల్, స్టేషన్ ఘనపూర్ మీదుగా పామునూర్‌కు చేరుకోనుంది పాదయాత్ర. ఇవాళ రాత్రి పామునూరు సమీపంలోనే బస చేయనున్నారు బండి సంజయ్. కాగా, నిన్న మునుగోడులో అమిత్ షా సభ కారణంగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్ పడింది. ఆ యాత్ర ఇవాళ్టి నుంచి మళ్లీ యధావిధిగా కొనసాగిస్తున్నారు సంజయ్. ఇదిలాఉంటే.. ఈనెల 27వ తేదీన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర తన పాదయాత్ర ముగుస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తారని ఆయన తెలిపారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌పైన విమర్శలు గుప్పించారు బండి సంజయ్. ఈడీ పేరు చెబితేనే కేసీఆర్ భయపడిపోతున్నారని ధ్వజమెత్తారు. ఇక ఎన్టీఆర్-అమిత్ షా భేటీపైనా రియాక్ట్ అయ్యారు. ఆ భేటీలో తాను లేనని, వాళ్లేం మాట్లాడుకున్నారో తనకు తెలియదని స్పష్టం చేశారు సంజయ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
