Watch Video: సినిమా సీన్ తలపించిన ప్రమాదం.. సీసీ టీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు..

ల్‌ సినిమాలో బైక్ స్టంట్లు చూస్తుంటాం. కానీ రియల్‌ లైఫ్‌లోనూ సేమ్ టు సేమ్ సీన్ అలాంటి సిట్యువేషన్‌ అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఖమ్మం రావిచెట్టు బజార్‌లోని ఓ క్లాత్ సెంటర్‌లో..

Watch Video: సినిమా సీన్ తలపించిన ప్రమాదం.. సీసీ టీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు..
Biker Breaks Mirror And Cra

Updated on: Nov 10, 2021 | 11:58 AM

రీల్‌ సినిమాలో బైక్ స్టంట్లు చూస్తుంటాం. కానీ రియల్‌ లైఫ్‌లోనూ సేమ్ టు సేమ్ సీన్ అలాంటి సిట్యువేషన్‌ అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఖమ్మం రావిచెట్టు బజార్‌లోని ఓ క్లాత్ సెంటర్‌లో జరిగిందీ ఘటన. రావిచెట్టు బజార్‌లోని క్లాత్‌ సెంటర్‌లో కస్టమర్లు బట్టలు కొనేందుకు వెళ్లారు. వాళ్ల పనిలో వాళ్లున్నారు. ఉన్నట్టుండి సడెన్‌గా షాప్‌లోకి ఓ బైక్ దూసుకొచ్చింది. షాప్ అద్దాల్లోంచి సినిమా సీన్‌ తలపిస్తూ దూసుకొచ్చిన బైక్‌ కిందపడిపోగా.. అది నడుపుతున్న వ్యక్తి  మాత్రం అంతెత్తున ఎగిరి కౌంటర్‌లోపల పడ్డాడు. ఇదంతా ఆ షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలకు చిక్కింది.

ఊహించని శబ్దంతో కస్టమర్లంతా కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడినుంచి పరుగుతీశారు. ఇక ఎగిరి కిందపడ్డ బైకర్‌.. మెల్లిగా నిల్చునే ప్రయత్నం చేశాడు. ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఆ వీడియోలోని దృశ్యాలను చేసిన పోలీసులు షాక్ అవుతున్నారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: శత్రువును ద్వేషించకు స్నేహితుడిలా చూడు.. చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే..

Mukesh Ambani Antilia Case: ముఖేష్ అంబానీ కుటుంబానికి ఎలాంటి ముప్పు లేదు.. చిరునామా అడిగిన వ్యక్తి ఎవరో తేల్చిన పోలీసులు..