Bank Cashier Robbery: బ్యాంక్‌లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం.. షాకింగ్ వీడియో విడుదల..!

|

May 12, 2022 | 9:39 PM

Bank Cashier Robbery: హైదరాబాద్‌లోని వనస్థలిపురం బ్యాంక్‌లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే..

Bank Cashier Robbery: బ్యాంక్‌లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం.. షాకింగ్ వీడియో విడుదల..!
Praveen
Follow us on

Bank Cashier Robbery: హైదరాబాద్‌లోని వనస్థలిపురం బ్యాంక్‌లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే చోరీకి కారణం తేలింది. బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానని మేనేజర్‌కు మెస్సేజ్ చేశాడు డబ్బు ఎత్తుకెళ్లిన క్యాషియర్. బెట్టింగ్‌లో డబ్బు వస్తే తిరిగి ఇస్తానని, లేదంటే సూసైడ్ చేసుకుంటానని బ్యాంకు ఉద్యోగులకు సమాచారం అందించాడు. ఈ మేరకు క్యాషియర్ ప్రవీణ్ ఒక వీడియోను విడుదల చేశాడు.

కాగా, రెండు రోజుల క్రితం వనస్థలిపురం బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న ప్రవీణ్.. కడుపులో నొప్పి వస్తుందని, ట్యాబ్లెట్ తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, వెళ్తూ వెళ్తూ రూ.22,53,378 రూపాయలు ఎత్తుకెళ్లాడు ప్రవీణ్. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న.. దర్యాప్తు చేపట్టారు. క్యాషియర్ ప్రవీణ్‌ను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే, తాజాగా ప్రవీణ్ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఈ అంశం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.