GHMC: హైదరాబాదీలు ఎగిరిగంతేసే వార్త.. ఆస్తి పన్ను చెల్లింపుపై జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన

హైదరాబాద్‌ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఆస్తి పన్ను బకాయిలపై భారీ రాయితీ కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీ రాయితీ ప్రకటిస్తూ వన్ టైమ్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.

GHMC: హైదరాబాదీలు ఎగిరిగంతేసే వార్త.. ఆస్తి పన్ను చెల్లింపుపై జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన
Ghmc Property Tax

Updated on: Dec 22, 2025 | 11:04 PM

హైదరాబాద్‌ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ఆస్తిపన్ను బకాయిదారులపై భారీ ఊరటనిస్తూ ‘వన్ టైమ్ స్కీమ్’ (OTS)ను ప్రకటించింది. దీని ప్రకారం.. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిల వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎవరికి వర్తిస్తుంది

ప్రభుత్వం ప్రకటించిన ఈ రాయితీ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తున్నట్టు పురపాలక శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. అయితే 2026 ఆస్తి పన్నుతో పాటు 10 శాతం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వసూలు చేయడంతో పాటు పన్ను చెల్లింపుదారులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుట్టు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ ఆస్తిపన్నును క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వివరాల కోసం GHMC అధికారిక వెబ్‌సైట్ ghmc.gov.in లేదా స్థానిక సర్కిల్ ఆఫీసును సంప్రదించండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.