Big News Big Debate: ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఓట్లు కొనాల్సిందేనా?

ఇజం మారుతోంది... పవన్‌ నమ్మిన సిద్దాంతాలు.. విధానాలు కొన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాయి. ఒకప్పుడు సైద్దాంతికంగా ఆయన వ్యతిరేకించిన అంశాల్లోనే ఇప్పుడు రాజీ పడుతూ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. డబ్బు రాజకీయాల నుంచి పొత్తుల దాకా పవన్‌ కల్యాణ్‌ ఒకప్పుడు కట్‌ రూల్డ్‌గా ఉన్నారు.

Big News Big Debate: ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఓట్లు కొనాల్సిందేనా?
Big News Big Debate

Updated on: Feb 22, 2024 | 7:07 PM

ఇజం మారుతోంది… పవన్‌ నమ్మిన సిద్దాంతాలు.. విధానాలు కొన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాయి. ఒకప్పుడు సైద్దాంతికంగా ఆయన వ్యతిరేకించిన అంశాల్లోనే ఇప్పుడు రాజీ పడుతూ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. డబ్బు రాజకీయాల నుంచి పొత్తుల దాకా పవన్‌ కల్యాణ్‌ ఒకప్పుడు కట్‌ రూల్డ్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు భిన్నంగా రాజీ మార్గంలో వెళుతున్నట్టుగా ఉంది. విజయం కోసం పాతికేళ్లు అయినా వేచి ఉంటామన్న జనసేన అధ్యక్షుడు ఇప్పుడు ఎలాగైనా అధికారంలోకి భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో ఉన్నారు. పార్టీని నడిపించడానికి డబ్బే అవసరం లేదన్న పవన్‌కల్యాణ్‌.. డబ్బుంటేనే గెలవగలం అనే స్థాయికి వస్తున్నారా? బుధవారం భీమవరంలో జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీశాయి.

మరోవైపు టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తుపై ఆసక్తికర అంశాలు తెరమీదకు వస్తున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తుల ప్రతిపాదన కోసం ఎంతో కష్టపడ్డానని.. జాతీయ నాయకులతో చివాట్లు కూడా తిన్నామని పవన్‌ అన్నారు. ఒప్పించడానికి ఎంతో నలిగిపోయినట్టు కూడా తెలిపారు. అయితే ఇందుకు భిన్నంగా ఎన్డీయేలో చేరాలని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం వచ్చిందని.. దీంతో టీడీపీ అధినేత చర్చలకు వెళ్లారని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఇంతకీ బీజేపీ పిలిచిందా? పవన్‌ కల్యాణ్‌ ఒప్పించారా..? ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చూద్దాం…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..