Big News Big Debate: ఎలక్షన్‌వార్‌లో ప్రత్యర్థులకు అందని ఎత్తులో కేసీఆర్‌.. బిగ్‌న్యూస్‌ బిగ్ డిబేట్‌

|

Aug 21, 2023 | 7:08 PM

గతంలో పోటీచేసిన 9మందికి ఈసారి టిక్కెట్లు దక్కలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్యకు బదులు కడియం శ్రీహరికి.. ఉప్పల్‌లో సుభాష్‌రెడ్డి స్థానంలో లక్ష్మారెడ్డికి.. వైరాలో రాములు నాయక్‌ను తప్పించి మదన్‌లాల్‌కు ఛాన్సిచ్చారు. వేములవాడలో చెన్నమనేని రమేశ్‌ బదులు చెల్మడ లక్ష్మినర్సింహారావుకు.. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు ప్లేసులో కోవా లక్ష్మికి.. ఖానాపూర్‌లో రేఖానాయక్‌ను కాదని జాన్సన్‌ నాయక్‌కు అవకాశం ఇచ్చారు. బోథ్‌లో రాథోడ్‌ బాపూరావ్‌కు బదులు అనిల్‌...

Big News Big Debate: ఎలక్షన్‌వార్‌లో ప్రత్యర్థులకు అందని ఎత్తులో కేసీఆర్‌.. బిగ్‌న్యూస్‌ బిగ్ డిబేట్‌
Big News Big Debate
Follow us on

సూర్యాపేట ప్రగతినివేదనసభ నుంచి ఎన్నికల సమరశంఖం పూరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌… రోజు గడవకముందే అభ్యర్థుల్ని కూడా ప్రకటించేశారు. ఎలక్షన్‌వార్‌లో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచారు. అన్ని సమీకరణలు లెక్కేసుకుని.. స్వల్ప మార్పులతో 115స్థానాలకు క్యాండిడేట్స్‌ను ఖరారు చేశారు. రాజకీయ చాణక్యంలో తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. నవంబర్‌, డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా… ఇంకా షెడ్యూల్‌ కూడా విడుదలవక ముందే … 4మినహా 115 స్థానాలకు రేసు గుర్రాల్ని అనౌన్స్‌ చేసేశారు.

గతంలో పోటీచేసిన 9మందికి ఈసారి టిక్కెట్లు దక్కలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్యకు బదులు కడియం శ్రీహరికి.. ఉప్పల్‌లో సుభాష్‌రెడ్డి స్థానంలో లక్ష్మారెడ్డికి.. వైరాలో రాములు నాయక్‌ను తప్పించి మదన్‌లాల్‌కు ఛాన్సిచ్చారు. వేములవాడలో చెన్నమనేని రమేశ్‌ బదులు చెల్మడ లక్ష్మినర్సింహారావుకు.. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు ప్లేసులో కోవా లక్ష్మికి.. ఖానాపూర్‌లో రేఖానాయక్‌ను కాదని జాన్సన్‌ నాయక్‌కు అవకాశం ఇచ్చారు. బోథ్‌లో రాథోడ్‌ బాపూరావ్‌కు బదులు అనిల్‌ జాదవ్‌ను… కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌ బదులు ఆయన కుమారుడు సంజయ్‌ని ఎంపిక చేసింది గులాబీ పార్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈసారి.. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండటం విశేషం. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ బరిలో దిగనున్నారు సీఎం. దీంతో ఈ రెండు స్థానాలూ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సెంచరీ మార్క్‌ దాటుతుందన్నారు కేసీఆర్‌.

ఇదిలా ఉంటే.. నర్సాపూర్‌, నాంపల్లి, గోషామహల్‌, జనగాం స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించని గులాబీ దళపతి… ఈ నాలుగు సీట్లలో మరింత పరిశీలన తర్వాత క్యాండిడేట్స్‌పై క్లారిటీ ఇస్తామన్నారు. తాజా లిస్టులో ఓసీలకు 58, బీసీలకు 23, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, మస్లింలకు 3 సీట్లు కేటాయించారు. వీరిలో ఏడుగురు మహిళలకు అవకాశం దక్కింది. రెడ్డిలకు 40, వెలమలకు 11, కమ్మవర్గానికి 5 సీట్లు దక్కగా.. బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలకు ఒక్కో టిక్కెట్‌ లభించింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్‌. సిరిసిల్ల అభ్యర్థిగా మరోసారి తనకు అవకాశమిచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం దక్కని క్రిశాంక్‌ లాంటి కొందరు సమర్థులకు మరో రూపంలో ప్రజాసేవకు అవకాశం కల్పిస్తామన్నారు. 119కి గాను 115మంది అభ్యర్థులను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్‌ సాహసోపేతమైన నాయకత్వంపై.. ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది ప్రతీక అన్నారు.

ఇదే అంశంపై ఈరోజు బిగ్ న్యూస్‌ బిగ్ డిబేట్‌..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..