సిగ్నల్స్‌ కోసం సాహసం.. అక్కడ ఫోన్‌ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందే.. ఇదెక్కడో మన తెలంగాణలోనే!

ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇంటర్నెట్‌ లేనిది ఏ పని జరగదు. కాసేపు ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలిగితే మనం అల్లాడిపోతాం. ఇంట్లో సిగ్నల్‌ సరిగ్గా రాకపోతే వెంటనే టెరస్‌పైకి వెళ్లి సిగ్నల్‌ కోసం వెతుక్కుంటా.. కానీ ఇక్కడో గ్రామాంలో సిగ్నల్‌ కోసం చెట్టు ఎక్కాల్సి వస్తోంది. ఆ గ్రామం మొత్తంలో ఆ ఒక్క చెట్టు దగ్గరే సిగ్నల్‌ వస్తుంది. అది కూడా చెట్టుపైకి ఎక్కుతేనే. దీంతో ఆ గ్రామంలో ఎవరు ఫోన్‌ మాట్లాడాలన్న ఆ చెట్ట వద్దకు వచ్చి పైకి ఎక్కి మాట్లాడాల్సిందే.. ఇంతరకు ఆ గ్రామం ఏదో తెలుసుకుందాం పదండి. ఆ గ్రామంలో టవర్‌ రావాలంటే చెట్టు ఎక్కాల్సిందే

సిగ్నల్స్‌ కోసం సాహసం.. అక్కడ ఫోన్‌ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందే.. ఇదెక్కడో మన తెలంగాణలోనే!
No Signal

Edited By:

Updated on: Jul 01, 2025 | 11:20 AM

ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇంటర్నెట్‌ లేనిది ఏ పని జరగదు. కాసేపు ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలిగితే మనం అల్లాడిపోతాం. ఇంట్లో సిగ్నల్‌ సరిగ్గా రాకపోతే వెంటనే టెరస్‌పైకి వెళ్లి సిగ్నల్‌ కోసం వెతుక్కుంటా.. కానీ ఇక్కడో గ్రామాంలో సిగ్నల్‌ కోసం చెట్టు ఎక్కాల్సి వస్తోంది. ఆ గ్రామం మొత్తంలో ఆ ఒక్క చెట్టు దగ్గరే సిగ్నల్‌ వస్తుంది. అది కూడా చెట్టుపైకి ఎక్కుతేనే. దీంతో ఆ గ్రామంలో ఎవరు ఫోన్‌ మాట్లాడాలన్న ఆ చెట్ట వద్దకు వచ్చి పైకి ఎక్కి మాట్లాడాల్సిందే. వివరాళ్లోకి వెలితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం గ్రామస్తుల సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేక పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఆ గ్రామస్తులకు ఫోన్లు రావాలన్నా.. వారి ఫోన్ కాల్ అవతలి వారికి పోవాలన్నా వారు ఆ గ్రామంలోని ఓ చెట్టు వద్దకు వెళ్లాల్సిందే.. ఆ చెట్టు ఎక్కాల్సిందే.

గ్రామ శివారులోని ఆ చెట్టు ఉన్న ఒక్క ప్రాంతంలో మాత్రమే సెల్‌ఫోన్ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ రావాలంటే గ్రామస్తులు అందరూ ఆ చెట్ల ఎక్కాల్సిందే. అదేవిధంగా వారు ఫోన్ మాట్లాడాలన్నా చెట్లపై ఎక్కి సిగ్నల్ సెర్చ్ చేసుకొని మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. ప్రతీది ఆన్‌లైన్‌ విధానాలపై జరుగుతున్న ఈ రోజుల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేక ఆ గ్రామస్తులు, విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యార్తులైతే స్కూల్‌, కాలేజ్‌లో జరుగుతున్న సమాచారం తెలుసుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీడియో చూడండి..


అన్ని సేవలు సెల్ ఫోన్ మయమైన ఈ రోజుల్లో తమ గ్రామానికి సెల్ టవర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవట్లేదని.. ఇకనైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో టవర్స్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.