Bhagwant Mann: కంటివెలుగు పథకం దేశానికి ఆదర్శం.. మేమూ అమలుచేస్తాం.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్..

దేశమనే పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పూలు ఉంటేనే బాగుంటుందని.. కానీ, కొందరు ఒకే రంగు పువ్వులను కోరుకుంటున్నారంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విమర్శించారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని..

Bhagwant Mann: కంటివెలుగు పథకం దేశానికి ఆదర్శం.. మేమూ అమలుచేస్తాం.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్..
Punjab Cm Bhagwant Mann

Updated on: Jan 18, 2023 | 5:05 PM

దేశమనే పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పూలు ఉంటేనే బాగుంటుందని.. కానీ, కొందరు ఒకే రంగు పువ్వులను కోరుకుంటున్నారంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విమర్శించారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. రాజు బికారి అవుతాడు, బికారి రాజు అవుతాడంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతమంది జనాన్ని చూడాలంటే మాకు స్పెషల్ అద్దాలు కావాలంటూ పంజాబ్ సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ కంటి వెలుగు అద్దాలిచ్చారని.. ఇంతమంది జనాన్ని చూడాలంటే మాకు స్పెషల్ అద్దాలు ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు.

కంటివెలుగు పథకం దేశానికి ఆదర్శమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఖమ్మం సభ దేశరాజకీయాల్లో తొలి మార్పునకు సంకేతమని.. మన దేశం అందమైన పూలమాల వంటిందని పేర్కొన్నారు. అందులో అన్ని రకాల పూలు ఉంటాయని.. కానీ బీజేపీ మాత్రం ఒకే రంగు పూలు ఉండాలని అంటోందన్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడంలో BJP నెంబర్‌ వన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో BJP ఓడిపోయింది. కానీ మేయర్‌ పదవి కోసం కుట్రలు చేస్తోందన్నారు. కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదని.. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయని.. ప్రధాని మోదీ ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఎర్రకోటపై 8 ఏళ్లుగా మోదీ సేమ్ స్పీచ్ ఇస్తున్నారంటూ భగవంత్ మాన్ విమర్శించారు. ప్రజల జీవితాలను ఎలాగూ మార్చలేకపోతున్నారు..కనీసం తన స్పీచ్‌నైనా మోదీ మార్చుకోవాలని సూచించారు. మోదీ ప్రజల కోసం కాదు.. తన మిత్రుల కోసం పనిచేస్తున్నారన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు దారుణమన్నారు. ఢిల్లీలో ఎల్‌జీ కేజ్రీవాల్ చేసే ప్రతిపనిని అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. కంటివెలుగు పథకాన్ని పంజాబ్‌లో అమలు చేస్తామని తెలిపారు. పంజాబ్‌లో డ్రగ్స్‌ పూర్తిగా కంట్రోల్ చేశామని.. అవినీతి ఎవరు చేసినా జైల్లో వేస్తున్నామని తెలిపారు. దేశంలో 130 కోట్ల మంది ప్రజలు నిజాయితీగా ఉన్నారు.. కానీ అదే నిజాయితీ నేతల్లో కొరవడుతోందన్నారు.