హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, కేబీఆర్ పార్క్ ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టి, గ్రిల్స్‌ను ధ్వంసం చేసింది బెంజ్ కారు. కేబీఆర్ పార్కు లోపలకు దూసుకెళ్లిన కారు, చెట్టును ఢీకొట్టి ఆగింది. ప్రమాదస్థలి భయానక వాతావరణంగా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు అయ్యినట్లుగా సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
—
దీపావళి రోజు రాత్రి నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చిన బెంజ్ కారు బంజారాహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ప్రయాణీకులకు ప్రాణాపాయం తప్పిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఫుట్ పాత్ పై ఉన్న బసవ తారకం క్యాన్సర్ పేషంట్ల సహాయకులు, నిరాశ్రయులు ప్రాణ భయంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుచుకున్నారు.
కాగా, ఈ ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు వదిలి డ్రైవర్ పారిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి బడాబాబు పుత్రరత్నం నిర్వాకం కావొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..