Be alert job aspirants : తెలంగాణ ఉద్యోగార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి జనవరి చివరి వారంలోగా నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసు వర్గాలే ధృవీకరించారు. ఇప్పటి వరకు పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అంతర్గతంగా అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి నియామాక ప్రక్రియను మరింత సరళం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
ఇదిలాఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. శాఖల వారీగా ఖాళీల వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆమేరకు పోలీస్ శాఖలో 20వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నిర్ధారించారు. ఆ 20 వేల పోస్టుల్లోనూ 425 ఎస్సై పోస్టులు ఉండగా, ఎస్సై సివిల్-368, ఏఆర్-29, కమ్యూనికేషన్స్-18 పోస్టులు ఉన్నాయి. ఇక 19,300 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, వీటిలో సివిల్-7764, ఏఆర్-6683, టీఎస్‌ఎస్‌పీ-3874, కమ్యూనికేషన్స్-256, 15వ బెటాలియన్‌లో 561 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
Also read: